- Telugu News Photo Gallery Sports photos PV Sindhu eat ice cream with prime minister narendra modi, also Honoring Olympic Medalists At His Home
PM Modi – Sindhu: కల నెరవేరింది.. ప్రధాని మోడీతో కలిసి ఐస్ క్రీం తిన్న పీవీ సింధు
Modi and Sindhu Eat Ice Cream: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని సాధించిన సింధు.. ఒలింపిక్స్‌లో వరుసగా రెండ పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే.
Updated on: Aug 16, 2021 | 1:39 PM

టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని సాధించిన సింధు.. ఒలింపిక్స్‌లో వరుసగా రెండ పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తరువాత పీవీ సింధుతో కలిసి ఐస్‌క్రీమ్ తింటానని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సింధు విజయం సాధించింది. దీంతో ప్రధాని మోదీతో కలిసి ఐస్ క్రీమ్ తినే అవకాశం కూడా దక్కింది.

మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భాగంగా కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పీవీ సింధు విజయం సాధించింది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై గెలుపొందింది. ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తరువాత పీవీ సింధుతో కలిసి ఐస్‌క్రీమ్ తింటానని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సింధు విజయం సాధించింది. దీంతో ప్రధాని మోదీతో కలిసి ఐస్ క్రీమ్ తినే అవకాశం కూడా దక్కింది. ఈమేరకు మోడీ ‘హార్డ్ వర్క్ చేయ్.. నీ మీద నమ్మకం ఉంది. ఈ సారి కూడా విజయం సాధిస్తావ్. నీ విజయం తర్వాత మీ అందరినీ కలుస్తా. ఐస్‍క్రీమ్ తిందాం’ అని మోదీ హామీ ఇచ్చారు. కాగా, ఒలింపిక్ విజేతలందరికి మోడీ ఈ రోజు తేనీటి విందు ఇచ్చారు.

నరేంద్ర మోడీతో కలిసి సరదాగా మాట్లాడుతున్న ఒలింపిక్ గోల్డ్ విన్నర్ నీరజ్ చోప్రా

భారత హాకీ టీంతో ప్రధాని మోడీ- ఆటోగ్రాఫ్ చేసిన హాకీ స్టిక్‌ను ప్రధానికి బహూకరిస్తున్న ఆటగాళ్లు

భారత హాకీ టీం కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో మాట్లాడుతున్న ప్రధాని మోడీ





























