11 సిక్సర్లు, 9 ఫోర్లు.. 20 బంతుల్లో 102 పరుగులు.. మాజీ ఆర్‌సీబీ ప్లేయర్ విధ్వసకర ఇన్నింగ్స్..

11 సిక్సర్లు, 9 ఫోర్లు.. 20 బంతుల్లో 102 పరుగులు.. మాజీ ఆర్‌సీబీ ప్లేయర్ విధ్వసకర ఇన్నింగ్స్..
Rcb

టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఎన్నో అపురూపమైన విజయాలను అందించిన సంగతి తెలిసిందే. కానీ ఐపీఎల్‌లో మాత్రం ఇప్పటివరకు..

Ravi Kiran

|

Aug 16, 2021 | 11:49 AM

టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఎన్నో అపురూపమైన విజయాలను అందించిన సంగతి తెలిసిందే. కానీ ఐపీఎల్‌లో మాత్రం ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా అతడి సొంతం కాలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారధ్య బాధ్యతలను తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటివరకు ఐపీఎల్‌లో కోహ్లి ఒక్క ట్రోఫీని సాధించలేకపోయాడు. పేపర్‌ మీద టీం బలంగా ఉన్నప్పటికీ.. మైదానంలోకి అడుగుపెట్టాక కోహ్లితో పాటు ఒక్క డివిలియర్స్ మినహా ఎవరూ పెద్ద రాణించలేకపోయేవారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..మాజీ ఆర్‌సీబీ ప్లేయర్, స్టార్ ఆల్‌రౌండర్‌ పుట్టినరోజు ఈరోజు. అతడెవరో కాదు ఆస్ట్రేలియా ప్లేయర్ మార్కస్ స్టోయినిస్. 1989వ సంవత్సరంలో మార్కస్ స్టోయినిస్ జన్మించాడు. ఈరోజు అతడు సాధించిన ఓ సూపర్బ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం.

2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టోయినిస్ కూడా ఉన్నాడు. అయితే ఆ తర్వాత సీజన్‌కు అతడ్ని తొలిగించారు. ఆర్సీబీ తరపున 10 మ్యాచ్‌లు ఆడిన స్టోయినిస్ 52.75 సగటుతో 131.25 స్ట్రైక్ రేట్‌తో 211 పరుగులు చేశాడు. అదే సమయంలో బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక స్టోయినిస్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరగా.. ఆ తర్వాత అతడు ఢిల్లీకి కీ ప్లేయర్‌గా మారాడు. ఇదిలా ఉంటే జనవరి 2017లో న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వన్డేలో మార్కస్ స్టోయినిస్ సూపర్బ్ ఆల్‌రౌండ్‌ షో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

బాల్-బ్యాట్‌తో చక్కటి ప్రదర్శన.. జట్టు ఓడిపోయినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. నీల్ బ్రూమ్ 73 పరుగులు, మార్టిన్ గప్తిల్ 61 పరుగులతో రాణించారు. చివర్లో జేమ్స్ నీషమ్ 48 పరుగులతో చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్ స్టోయినిస్ మూడు వికెట్లు తీశాడు.

భారీ లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే తడబడింది. 67 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఇక అప్పుడే క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 117 బంతుల్లో 146 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడు ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 9 ఫోర్ల ఉన్నాయి. అంటే 20 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆరు పరుగులతో ఆస్ట్రేలియా ఓడిపోయినప్పటికీ.. స్టోయినిస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Also Read:

జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

 ఈ ఫోటోలో పులి దాగుంది.. మీరు గుర్తించగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చు చూడండి.!

ఎనిమిదో స్థానంలో సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియాకు సూపర్ విక్టరీ.. గెలిపించిన బెస్ట్ ఆల్‌రౌండర్!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu