ఆఫ్గనిస్తాన్ లో అమెరికన్ ఎంబసీ అధికారులు ఏం చేస్తున్నారో తెలుసా ..?

ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు క్రమంగా కాబూల్ నగరానికి చేరువవుతుండగా ఈ నగరంలోని అమెరికన్ ఎంబసీ అధికారులకు తమ దేశం నుంచి అర్జెంట్ మెసేజ్ అందింది.

ఆఫ్గనిస్తాన్ లో అమెరికన్ ఎంబసీ అధికారులు ఏం చేస్తున్నారో తెలుసా ..?
Taliban
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 15, 2021 | 2:57 PM

ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు క్రమంగా కాబూల్ నగరానికి చేరువవుతుండగా ఈ నగరంలోని అమెరికన్ ఎంబసీ అధికారులకు తమ దేశం నుంచి అర్జెంట్ మెసేజ్ అందింది. అదేమిటంటే.. కార్యాలయంలోని కీలకమైన డాక్యుమెంట్లనన్నింటినీ నాశనం చేయాలన్నదే ఆ మెసేజ్ లోని ప్రధానాంశం. ఆ మేరకు అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఈ కార్యక్రమం చేబట్టారు. ‘ఎమర్జెన్సీ డిస్ట్రక్షన్ సర్వీసెస్’ లోభాగంగా వారిందుకు పూనుకొన్నారు. ఎంబసీలోని అమెరికన్ జాతీయ పతాకాలు, లోగోలను, ఇతర వస్తువులను తాలిబన్లు దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉన్నవాటిని తక్షణమే నాశనం చేయాలని వీరికి ఆదేశాలు అందాయి. త్వరితగతిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు బర్న్ బిన్స్, డిజింటిగ్రేటర్, కంపాక్టర్ వంటి వివిధ ‘విఛ్చిన్న వస్తువులను అమెరికా హెలీకాఫ్టర్లద్వారా పంపింది.

కాబూల్ లోని తమ రాయబార కార్యాలయంలో ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చేపట్టినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. సిబ్బందిని కుదించడం వంటి చర్యలు కూడా ఇందులో ఉంటాయని పేర్కొంది. కాగా ఈ సాధనాలను తీసుకువస్తున్న హెలికాప్టర్లు రాయబార కార్యాలయం వద్దకు చేరుకోవడం, తిరిగి దుమ్ము రేపుతూ నిష్క్రమించడం కనిపిస్తోంది.ఇలా ఉండగా జలాలాబాద్ సహా ముఖ్యమైన ప్రాంతాలను తాము సులభంగా ఆక్రమించుకోవడం చూస్తే ఆఫ్ఘన్లు గానీ, విదేశీయులు గానీ తమ ఆక్రమణలను సమర్థిస్తున్నట్టే కనిపిస్తోందని తాలిబన్లు అంటున్నారు. తమ హయాంలో కూడా సురక్షితంగానే ఉండగలమని వీరు భావిస్తున్నట్టు మేము దాదాపు నిర్ధారణకు వచ్చాం అని తాలిబన్ల ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. మజారే షరీఫ్ తరువాత వీరు జలాలాబాద్ లో తమ పతాకాలను ఎగురవేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Car Hit: తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. మద్యం మత్తులో పోలీసులను ఢీ కొట్టాడు.. కట్ చేస్తే..

Vodafone Idea: సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్న వోడాఫోన్‌ ఐడియా.. ఈ త్రైమాసికంలో తగ్గిన నష్టం