AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vodafone Idea: సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్న వోడాఫోన్‌ ఐడియా.. ఈ త్రైమాసికంలో తగ్గిన నష్టం

Vodafone Idea: వోడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రైవేటు రంగ టెలికాం కంపెనీ జూన్‌ 30, 2021 తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో..

Vodafone Idea: సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్న వోడాఫోన్‌ ఐడియా.. ఈ త్రైమాసికంలో తగ్గిన నష్టం
Vodafone Idea
Follow us
Subhash Goud

|

Updated on: Aug 15, 2021 | 2:34 PM

Vodafone Idea: వోడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రైవేటు రంగ టెలికాం కంపెనీ జూన్‌ 30, 2021 తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.7,219 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నివేదించింది. ఈ కారణంగా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.25,460 కోట్ల నష్టాన్ని చవి చూసింది. త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నిర్వహణ ఆదాయం దాదాపు 14 శాతం క్షీణించి రూ.9,152.3 కోట్లకు చేరింది. మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి కంపెనీ మొత్త స్థూల రుణం రూ.1,91,590 కోట్లుగా ఉంది. ఇందులో 1,06,010 కోట్ల స్పెక్ర్టమ్‌ చెల్లింపు నిబద్దత, రూ.62,180 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం ఉంది. అయితే త్రైమాసికం ముగింపులో కంపెనీ నగదు, నగదుకు సమానమైనవి రూ.920 కోట్లు ఉన్నాయి. తద్వారా కంపెనీ నికర రుణ భారం రూ.1,90,670 కోట్లుగా ఉంది.

కంపెనీపై భారీ అప్పు

అయితే, గత త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నష్టాలు భారీగానే పెరిగాయి. అంతకుముందు త్రైమాసికంలో కంపెనీకి రూ .6985.1 కోట్ల నష్టం వచ్చింది. వోడాఫోన్ ఐడియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రవీందర్ టక్కర్ మాట్లాడుతూ.. మా కస్టమర్లను ముందుకు తీసుకెళ్లడానికి మా వ్యూహాలను అమలు చేయడంపై మేము దృష్టి సారిస్తున్నాము. మా ఖర్చు గరిష్టీకరణ ప్రణాళిక ట్రాక్‌లో ఉంది. అయితే వాస్తవానికి, కంపెనీ రుణభారం పెరుగుతోంది, అలాగే కొత్త పెట్టుబడి ముగియడం వల్ల సమస్యలు పెరిగాయి. ఈ కారణంగా వొడాఫోన్-ఐడియా ఛైర్మన్ కుమార్ మగలం బిర్లా కంపెనీలో తన వాటాను ప్రభుత్వానికి విక్రయించడానికి ప్రతిపాదించాడు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. బిర్లా రాజీనామా తర్వాత, కంపెనీ ఇప్పుడు మూసివేయబడుతుందా లేదా అనేది తెలియడం లేదు.

అయితే, వొడాఫోన్ ఇండియా సీఈఓ తన ఉద్యోగులకు భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. విషయం అంతా నియంత్రణలో ఉంది. కానీ గణాంకాలు వేరే సాక్ష్యాన్ని ఇస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. వొడాఫోన్ ఐడియా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిధుల సేకరణ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీకి తక్షణమే ప్రభుత్వ ప్యాకేజీని బిర్లా ఇటీవల డిమాండ్ చేశారు. వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ ఆగస్టు 31, 2018 న విలీనం అయ్యాయి. అప్పటి నుండి ఈ కంపెనీ నిరంతరం నష్టాల్లోనే కొనసాగుతోంది.

ఇవీ కూడా చదవండి

Mahatma Gandhi: భారత కరెన్సీ నోట్లపై మొదటి సారిగా మహాత్మగాంధీ చిత్రాన్ని ఎప్పుడు ముద్రించారు? ఆసక్తికర విషయాలు

LIC: కస్టమర్లు అలర్ట్‌.. మీరు ఎల్‌ఐసీ పాలసీని తీసుకున్నారా.? అయితే ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి..!