AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ఉపాధిలో కొత్త కోణం.. కొర్రమీనుతో కోట్లు.. అతని విజయం వెనుక ఉన్న రహస్యం ఇదే..

మత్స్యపరిశ్రమ అనగానే, ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది ఏపిలోని కోస్తాప్రాంతం. ఎందుకంటే.. ఈ పరిశ్రమకు నీటి వనరులు పుష్కలంగా వుండాలి మరి. కానీ నీటి వనరులు తక్కువగా ఉన్న నల్గొండ జిల్లాలో కూడా ఓ రైతు...

Success Story: ఉపాధిలో కొత్త కోణం.. కొర్రమీనుతో కోట్లు.. అతని విజయం వెనుక ఉన్న రహస్యం ఇదే..
Koramenu Fish Seed
Sanjay Kasula
|

Updated on: Aug 15, 2021 | 1:48 PM

Share

మత్స్యపరిశ్రమ అనగానే, ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది ఏపిలోని కోస్తాప్రాంతం. ఎందుకంటే.. ఈ పరిశ్రమకు నీటి వనరులు పుష్కలంగా వుండాలి మరి. కానీ నీటి వనరులు తక్కువగా ఉన్న నల్గొండ జిల్లాలో కూడా ఓ రైతు కొరమేను చేపల పెంపకమే కాదు కొరమేనే చేప పిల్లల ఉత్పత్తి చేపట్టి ఔరా అనిపిస్తున్నాడు. చౌడు భూములను సైతం ఈ రైతు, జలపుష్పాలకు అనువుగా మలిచిన తీరు ముచ్చటగొలుపుతోంది. నమ్మశక్యంగా లేదు కదూ.. ఇక్కడి ప్రగతిని చూస్తే, నమ్మక తప్పదు.. మరి ఆ రైతు చేపడుతున్న విత్తన పిల్లల పెంపకంలో అనుభవాలను తెలుసుకుందాం..

మత్స్యసంపదకు కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విరాజిల్లుతోంది. అయితే ఇటీవలి కాలంలో తెలంగాణలో కూడా చేపల చెరువుల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. మాగాణి భూముల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం.. ఇటు చదువుకున్న యువత చెపల పెంపకంపై మక్కువ చూపడమే ఇందుకు కారణం.

ఈ కోవలోనే నల్గొండ జిల్లా , మర్రిగూడ మండలం, దామెరభీమనపల్లి గ్రామానికి చెందిన రైతు కొప్పు విజయ్ కుమార్ కొరమేను విత్తన చేప పిల్లలను ఉత్పత్తి చేస్తూ… సరికొత్త సాగుకి శ్రీకారం చుట్టాడు. నాణ్యమైన చేప పిల్లలను తెలంగాణలోని పలు ప్రాంతాలకు విక్రయిస్తూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. నలుగురికి ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నీ ఈ చెరువలను చూడండీ.. ఇవన్నీ కొరమేను చేపపిల్లల ఉత్పత్తి చేసే చెరువులు. రైతు విజయ్ కుమార్ ది మత్స్యకార కుటుంబం కావడంతో చేపలు పట్టే అనుభవం ఉంది. ఉపాధి కోసం తన పూర్వికులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి కాలం వెల్లదీసేవారు. కానీ ఈ రైతు తన ప్రాంతంలోనే స్వంతంగా చేపల పెంపకం చేపట్టాలనుకున్నారు.

ఇందుకోసం భూవనేశ్వర్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. 2009లో తనకున్నవ్యవసాయ భూమిలో చెరువులను తీయించి అందులో కొరమేను చేపల పెంపకం మొదలు పెట్టాడు. జాతీయ మత్స్య అభివృద్దిబోర్డు వారు అందించిన 7 లక్షల 50 వేల సహకారంతో 2011 లో కొరమేను విత్తన పిల్లల పెంపకం చేపట్టాడు. నాణ్యమైన పిల్లలను ఉత్పత్తి చేస్తూ.. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేస్తూ.. మంచి ఆధాయాన్ని పొందుతున్నారు.

పంటలకు పనికి రాని ఈ చౌడు భూముల్లో 12 సంవత్సరాల క్రితం 2 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కల్చర్ ను, నేడు 7 ఎకరాలకు విస్తరించారు. విడుతల వారిగా చేపపిల్లలను వివిధ ట్యాంకుల్లో పెంచి మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నారు. చెరువల తవ్వకానికి పెట్టుబడి ఖర్చు భారీగా ఉన్నా.. ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ముందడుగు వేస్తున్నారు. ఏడాదికి 50 నుండి 60 లక్షల కొరమేను విత్తన చేప పిల్లల ఉత్పత్తి చేస్తూ 2 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు.

మార్కెట్ లో కొరమేను చేపలకు మంచి డిమాండు వుండటంతో ఆదాయానికి కొదవలేదు. ఇది గమనించిన చదువుకున్న యువత ఇప్పుడు కొరమేను చేపల పెంపకానికి మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది యువరైతులు ఈ చేపల పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

తెలంగాణలో చేపల పెంపకం విస్తీర్ణాన్ని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను రూపొందించిన క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే నానుడి ఉంది. ముఖ్యంగా అధికారునుండి ప్రోత్సాహం కనబడుటలేదని, అందుకే కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వారికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించితే తెలంగాణ కూడా మరో కోస్తాప్రాంతంగా తయారయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: Barack Obama Video: ఒబామా‌ను ఇరుకున పెట్టిన వీడియో లీక్.. క్షమాపణ కోరిన అమెరికా సింగర్

IND vs ENG 2nd Test Day 3 Highlights: ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్.. 391 పరుగులకు ఆలౌట్..