Sleeveless Jacket: మహిళల రక్షణ కోసం స్టూడెంట్స్ వినూత్న ఆలోచన.. టచ్ చేస్తే షాక్‌కొట్టే జాకెట్ ఆవిష్కరణ
Sleeveless Jacket: మగువ అన్నింటా మగవారితో సమానమే.. అంబరాన్ని అందుకుంటుంది.. సముద్రంలోతుని కొలుస్తుంది. కానీ సాటి మనిషి దగ్గర మాత్రం స్వేచ్ఛగా తిరగలేని స్టేజ్ లో ఉంది. పగలు లేదు, రాత్రి లేదు వయసుతో..
Sleeveless Jacket: మగువ అన్నింటా మగవారితో సమానమే.. అంబరాన్ని అందుకుంటుంది.. సముద్రంలోతుని కొలుస్తుంది. కానీ సాటి మనిషి దగ్గర మాత్రం స్వేచ్ఛగా తిరగలేని స్టేజ్ లో ఉంది. పగలు లేదు, రాత్రి లేదు వయసుతో సంబంధం లేదు.. ఏ సమయంలోనైనా మహిళలు రోడ్డుమీద నడవలేని స్టేజ్ ఉంది. దేశంలో ఎక్కడోచోట రోజూ ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు గురించి వార్తలు వింటూనే ఉన్నాం.. దీంతో మహిళలు తమని తామే మానవ మృగాల నుంచి కాపాడుకోవడం కోసం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని సూచిస్తున్నారు. చిన్న చిన్న వెపన్స్ స్త్రీలు దగ్గర ఉంచుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు కాలేజీ స్టూడెంట్స్ మహిళల రక్షణ కోసం వినూత్నంగా ఆలోచించారు. ‘గార్డియన్’ అనే ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇది మహిళలు ధరించే వెస్ట్ కోట్‌లా ఉంటుంది. ఎవరైనా ఆడపిల్లలను అసభ్యంగా తాకాలని చూస్తే వెంటనే ఈ కోట్ వారికీ షాక్ ఇస్తుంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఒసైద్ అహ్మద్ షరీఫ్, ఫాయిక్ హుస్సేన్, మహ్మద్ ముత్తల్ అహ్మద్ ఫరూకీలు కలిసి ‘గార్డియన్’ను రూపొందించారు. అమ్మాయిలక ఎల్లవేళల రక్షణ కవచంలా ఉండేలా దీనిని రూపొందించామని తెలిపారు. అంతేకాదు ఈ వెస్ట్ కోస్ట్ 16 టచ్ పాయింట్‌లతో కూడిన స్లీవ్‌లెస్ జాకెట్. ఛాతీ, వీపు వంటి శరీర భాగాల్లో ఎవరైనా బలవంతంగా తాకడానికి ప్రయత్నిస్తే వెంటనే ఆ వెస్ట్‌కోట్ వారికి షాక్ కొడుతుంది. కీచైన్ ద్వారా జాకెట్ ను యాక్టివేట్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు.
ఎవరైనా టచ్ చేస్తే.. జాకెట్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు 2వేల వాట్ల విద్యుత్ షాక్ కొడుతుంది. అప్పుడు దుండగుడు నొప్పితో విలవిల్లాడిపోతాడు. అదే సమయంలో అమ్మాయి జీపీఎస్ స్థానాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ఎస్ఎమ్‌ఎస్ ద్వారా పంపబడుతుంది. ఐదు వెర్షన్‌లను రూపొందించిన ఈ జాకెట్‌లో మహిళలతో ట్రయల్స్ చేస్తూ ఫీడ్‌బ్యాక్ తీసుకుని మార్పులు చేర్పులు చేశారు. వారం నుంచి ప్రీఆర్డర్‌లు వస్తున్నాయని జాకెట్ మేకర్స్ చెప్పారు. అంతేకాదు 100% కాటన్ డెనిమ్‌తో తయారైన స్లీవ్‌లెస్ జాకెట్ ధరించడానికి అనువుగా అందంగా ఉండేలా రూపొందించారు.
Also Read: భారత ఇన్‌లైన్ హాకీ టీమ్‌కు ఎంపికైన ప్రీతి నిగమ్, నగేష్‌ల తనయుడు ఆర్యన్