Hair Care Tips: జుట్టు ఒత్తుగా పెరగాలా?.. అయితే ఈ ఫుడ్‌ని మీ డైట్‌లో చేర్చండి..

Hair Care Tips: ఆరోగ్యకరమైన జుట్టుకు ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా ముఖ్యం. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా జుట్టును..

Hair Care Tips: జుట్టు ఒత్తుగా పెరగాలా?.. అయితే ఈ ఫుడ్‌ని మీ డైట్‌లో చేర్చండి..
Hair
Follow us
Shiva Prajapati

| Edited By: Phani CH

Updated on: Aug 15, 2021 | 8:15 AM

Hair Care Tips: ఆరోగ్యకరమైన జుట్టుకు ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా ముఖ్యం. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా జుట్టును సంరక్షించుకోవచ్చు. ముఖ్యంగా విటమిన్ డి, సి, ఇ, బయోటిన్, జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి జుట్టు సంరక్షణ కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అవకాడో.. అవకాడో టెస్టీగా ఉండటమే కాకుండా.. అనేక రకాల పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులకు కలిగి ఉంటుంది. మన శరీరం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను స్వయంగా ఉత్పత్తి చేయదు. ఈ కొవ్వు పదార్థాలను మన ఆహారం ద్వారా పొందాలి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మీ జుట్టును బలంగా, మెరిసేలా చేయడానికి, జుట్టు కుదుళ్లను శక్తివంతంగా చేస్తాయి. అవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే విటమిన్ ఇ ని అధికంగా కలిగి ఉంటుంది. రోజూ ఒక అవకాడో తింటే.. మీ శరీరానికి కావాల్సిన విటమిన్ ఇ ని అందిస్తుంది. విటమిన్ ఇ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్, డ్యామేజ్ నుండి తలను కాపాడుతుంది.

బెర్రీలు.. జుట్టు పెరుగుదలకు బెర్రీలు ఉపకరిస్తాయి. వీటిలో విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బెర్రీలలో ఉండే ఈ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ నుండి హెయిర్ ఫోలికల్స్‌ను రక్షించడంలో కూడా సహాయపడతాయి. అదనంగా, విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మన జుట్టును బలోపేతం చేసే ప్రోటీన్ రకం. బెర్రీలు ఆర్థరైటిస్ తో బాధపడేవారికి, ముఖ్యంగా వృద్ధులకు ప్రయోజనకరంగా ఉంటాయి.

గుడ్లు.. గుండ్లు తల వెంట్రుకలను బలోపేతం చేస్తాయి. ఈ గుడ్లలో జుట్టు వేగంగా పెరిగేందుకు అవసరమైన బయోటిన్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. హెయిర్ ఫోలికల్స్ ఎక్కువగా ప్రోటీన్లతో తయారవుతాయి. అందుకే వీటిని మీ ఆహారం చేర్చడం ముఖ్యం. కెరాటిన్ అనే హెయిర్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి బయోటిన్ అవసరం. ఇక జింక్, సెలీనియం, ఇతర జుట్టు ఆరోగ్య పోషకాలకు గుడ్లు ఎంతో కీలకం. ఇది కాకుండా, ఆరోగ్యకరమైన, ముదురు జుట్టుకు ఇది ఉత్తమమైన ఆహారం. గుడ్లు మీ జుట్టుకు మాత్రమే కాకుండా మీ ఎముకలు, కండరాలను కూడా బలోపేతం చేస్తాయి.

పాలకూర.. మృధువైన, మెరిసే జుట్టుకోసం పాలకూర తప్పకుండా తినండి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం పాలకూర బెటర్. పాలకూరలో ఐరన్, మెగ్నీషియం, విటమిన్స్ ఎ, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టును మెరిసేలా చేస్తుంది. ఒక కప్పు పాలకూర మీ రోజువారీ విటమిన్ ఎ అవసరాన్ని తీరుస్తుంది. ఇది సెబమ్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

వాల్ నట్స్.. జుట్టు సాంద్రత కోసం మీ ఆహారంలో వాట్స్ నట్స్ తప్పక ఉండాల్సిందే. ఈ వాల్‌నట్స్.. రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పోషలకాలతో నిండి ఉంటాయి. ఇవి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, విటమిన్ బి, జింక్ వంటి పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మందపాటి జుట్టుకు ఉపయోగపడతాయి. నట్స్‌లో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది జుట్టుకు మేలు చేస్తుంది. కొద్దిపాటి గింజలు మీ రోజువారీ ఆహారానికి అవసరమైన విటమిన్ ఇ ని కలిగి ఉంటాయి. ఉదయాన్నే నట్స్ తీసుకోవాలి. డయాబెటిస్ కారణంగా బరువు సంబంధిత సమస్యలను నియంత్రించడం, గుండె సంబంధిత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఈ వాల్‌నట్స్ రక్షిస్తాయి.

Also read:

Independence Day 2021 Live: 75 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు చాలా స్పెషల్.. ఎర్రకోటపై రెపరెపలాడనున్న త్రివర్ణ పతాకం.. షెడ్యూల్ వివరాలు..

Andhra Pradesh: ఏం కాదులే అని ముందుకు వెళ్లాడు.. అందరి ప్రాణాలను రిస్క్‌లో పెట్టాడు.. అదృష్టం బాగుండి బయటపడ్డారు..

YS Viveka Murder Case: ‘‘పెద్దలతో పెట్టుకునే శక్తి లేదు.. నాకు ప్రాణ హానీ ఉంది’’: మణికంఠ రెడ్డి