Neem Face Pack: అందమైన ముఖం కోసం వేప ఫేస్ ప్యాక్.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!
Neem Face Pack: వేప చెట్టులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. చెట్టుకు సంబంధించిన వేర్లు మొదలు, కాయ, పూత, బెరడు,
Neem Face Pack: వేప చెట్టులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. చెట్టుకు సంబంధించిన వేర్లు మొదలు, కాయ, పూత, బెరడు, ఆకులు అన్నీ ఉపయోకరమే. అందుకే.. ఈ వేపను ఔషధాల తయారీలో, కాస్మోటిక్స్ తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా కాస్మోటిక్స్‌లో ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. రోజూ టీవీల్లో వచ్చే సబ్బు యాడ్స్‌లలో వేప చేసే మేలు గురించి వింటూనే ఉంటాయి. ఇన్ని ప్రయోజానాలు ఉన్న ఈ వేపను ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తారని మీకు తెలుసా? ఈ వేప ఫేస్ ప్యాక్.. చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, నల్లని మచ్చలు, ఎరుపు, సన్నని గీతలు, ముడుతలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే.. మొటిమలకు చికిత్స చేయడానికి వేపను సాధారణంగా ఉపయోగిస్తారు. వేప ఆకు పొడి, వేప నూనె రెండూ చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తుంటారు. మరి వేప ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేప ఫేస్ ప్యాక్ యొక్క ప్రయోజనాలు.. ఈవెన్స్ స్కిన్ టోన్.. వేప ఫేస్ ప్యాక్ స్కిన్ టోన్‌ను సమం చేయడానికి సహాయపడుతుంది. వేపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డార్క్ స్పాట్స్, ఇతర సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది చర్మాన్ని మచ్చ లేకుండా చేస్తుంది.
మొటిమలకు చికిత్స చేస్తుంది.. వేప ఫేస్ ప్యాక్ యాంటీ బాక్టీరియల్ కారణంగా మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఎలాంటి బ్రేక్ అవుట్‌ను అయినా తొలగిస్తుంది. దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఏజెంట్లను కలిగి ఉంటుంది. మొటిమల చికిత్సకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తగ్గిస్తుంది.. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వదిలించుకోవడానికి, ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా సహజమైన ప్రత్యామ్నాయాలను కూడా ట్రై చేయొచ్చు. వేప ఫేస్ ప్యాక్ ముఖంపై ఉండే మురికిని తొలగిస్తుంది.
చర్మ వ్యాధులను నివారిస్తుంది.. వేప ఫేస్ ప్యాక్‌ని సరైన పద్ధతిలో అప్లై చేయడం ద్వారా చర్మ వ్యాధులను నివారించవచ్చు. వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి.
మచ్చల నుంచి ఉపశమనం.. మొహంపై మొటిమలు, మొటిమల మచ్చలను తగ్గించడంలో వేప ఫేస్ ప్యాక్ సహాయపడుతుంది.
వృద్ధాప్య చాయలు కనిపించకుండా చేస్తుంది.. వృద్ధాప్య చాయలు కనిపించకుండా చేస్తుంది. వేప ఫేస్ ప్యాక్.. చర్మం సన్నబడటం, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. వేపలో చర్మాన్ని ఆరోగ్యంగా చేసే విటమిన్ ఇ, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి వృద్ధాప్య చాయలను నివారించడంలో సహాయపడుతాయి.
వేప మరియు కలబంద ఫేస్ ప్యాక్.. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని సహజంగా మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. దీని కోసం, 1 టీస్పూన్ వేప పొడి, తాజా కలబంద జెల్ తీసుకోండి. ముందుగా, ఒక గిన్నెలో పదార్థాలను కలపండి మరియు పేస్ట్‌ను మీ చర్మంపై రాయండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి, తర్వాత చర్మాన్ని మసాజ్ చేసేటప్పుడు మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగండి.
Also read:
YS Viveka Murder Case: ‘‘పెద్దలతో పెట్టుకునే శక్తి లేదు.. నాకు ప్రాణ హానీ ఉంది’’: మణికంఠ రెడ్డి
Earthquake in Haiti: హైతీలో భారీ భూకంపం.. 29 మందికి పైగా మృతి.. శిథిలాల్లో చిక్కుకున్న వందలాదిమంది..