Earthquake in Haiti: హైతీలో భారీ భూకంపం.. 29 మందికి పైగా మృతి.. శిథిలాల్లో చిక్కుకున్న వందలాదిమంది..

Earthquake in Haiti: హైతీలో భారీ భూకంపం సంభవించింది. భూప్రకంపనల కారణంగా భవనాలు నేలకూలాయి. ఈ ఘటనలో దాదాపు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

Earthquake in Haiti: హైతీలో భారీ భూకంపం.. 29 మందికి పైగా మృతి.. శిథిలాల్లో చిక్కుకున్న వందలాదిమంది..
Earthquake
Follow us

|

Updated on: Aug 15, 2021 | 12:20 AM

Earthquake in Haiti: హైతీలో భారీ భూకంపం సంభవించింది. భూప్రకంపనల కారణంగా భవనాలు నేలకూలాయి. ఈ ఘటనలో దాదాపు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆదేశ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సెయింట్ లూయిస్ డు సుడ్‌కు ఈశాన్యంగా 12 కిలోమీటర్లు దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2 గా నమోదైంది. ఇంత స్థాయిలో భూప్రకంపనలు సంభవించడంతో.. భవనాలు కూలిపోయాయి. భూమి చీలిపోయింది. మొత్తంగా భారీ ఆస్తినష్టంతో పాటు.. ప్రాణ నష్టం సంభవించింది.

ఇదిలాఉంటే.. హైతీలో భూకంపానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూస్తే.. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీధులన్నీ శిథిలాలతో నిండిపోయాయి. వాతావరణం అంతా దుమ్ముదూళితో నిండిపోయింది. చాలా మంది గాయాలతో వీధుల వెంట ఆర్తనాదాలు చేస్తుండటం అక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. గతంలో హైతీలో భారీ భూకంపం సంభంవించింది. 2010, జనవరి 12న హైతీలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించగా.. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు.

Earthquake 1

Earthquake 1

Earthquake 2

Earthquake 2

Earthquake 3

Earthquake 3

Tweets:

Also read:

IND vs ENG 2nd Test Day 3: లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు..

Hyderabad City: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అక్కాచెల్లెళ్లు మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు..

మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో మహిళా కార్పొరేటర్‌పై దాడి.. మీర్‌పేట కార్పొరేటర్ ముద్ద పవన్ అరెస్ట్