తాలిబన్ల చేతుల్లోకి మజారే షరీఫ్.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ల తరలింపునకు అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయం
ఆఫ్ఘన్ లో అతి కీలకమైన మజారే షరీఫ్ నగరాన్ని తాలిబన్లు వశపరచుకున్నారు. శనివారం రాత్రి వారి వాహనాలు ఈ నగరంలో ప్రవేశించాయి. అప్పటికే ప్రభుత్వ అధికారులు, ఆఫ్ఘన్ సైనిక దళాలు సిటీనుంచి నిష్క్రమించడంతో వారి రాకకు అడ్డే లేకపోయింది.
ఆఫ్ఘన్ లో అతి కీలకమైన మజారే షరీఫ్ నగరాన్ని తాలిబన్లు వశపరచుకున్నారు. శనివారం రాత్రి వారి వాహనాలు ఈ నగరంలో ప్రవేశించాయి. అప్పటికే ప్రభుత్వ అధికారులు, ఆఫ్ఘన్ సైనిక దళాలు సిటీనుంచి నిష్క్రమించడంతో వారి రాకకు అడ్డే లేకపోయింది. మజారే షరీఫ్ వీధుల్లో ఎక్కడ చూసినా వీరి వాహనాలే కనిపించాయి. ఇక్కడ తాము సాధించిన విజయానికి తాలిబన్లు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. తమకు ఈ నగరంలో ఆఫ్ఘన్ దళాల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతుందని వీరు భావించినా ఆ ఛాయలేవీ కనబడలేదు. ఇలా ఉండగా ఆఫ్ఘానిస్తాన్ నుంచి తమ సైనికులు, అమెరికన్ల తరలింపునకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయించారు. అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ సిస్టం తో సంప్రదించిన అనంతరం ఆయన.. ఇందుకోసం 5 వేలమంది సైనికులను నియోగించాలని ప్రతిపాదించారు. మొదట 3 వేలమందిని, ఆ తరువాత 2 వేల మందిని ఈ కార్యక్రమంకోసం నియమిస్తారు. అయితే ఈ తరలింపు కార్యక్రమాన్ని తాలిబన్లు అడ్డుకున్న పక్షంలో సైనిక పరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని వారిని ఆయన హెచ్చరించారు. మజారే షరీఫ్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత ఆయన ఈ ప్రకటన చేశారు. మా ఈ కార్యక్రమంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా ఊరుకోబోమన్నారు.
అటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నిన్న రాత్రి ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో ఫోన్ లో మాట్లాడారు. హింసను అదుపు చేయడానికి దౌత్యపరమైన, రాజకీయ ప్రయత్నాల గురించి వారిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు కాబూల్ లోని అమెరికన్ రాయబార కార్యాలయంలో గల తమ సిబ్బందిని, ఆఫ్ఘన్ అధికారుల తరలింపునకు అమెరికన్ సైనికులు అప్పుడే రంగంలోకి దిగినట్టు సమాచారం.. సుమారు 30 వేలమందిని తరలించాలని పెంటగాన్ అంచనా వేస్తోంది. ఈ పరిణామాలు ఇలా ఉండగా ఆఫ్ఘన్ లో ఈ పరిస్థితికి మాజీ అధ్యక్షుడు ట్రంప్ బాధ్యుడని జొబైడెన్ ఆరోపిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Realme Laptop: మీ ల్యాప్‌టాప్‌లను బద్దలు కొట్టండని చెబుతోన్న రియల్‌మీ.. సరికొత్త ప్రచారానికి తెర తీసిన టెక్ దిగ్గజం.