Independence Day: జాతీయ జెండా గురించి మీకు ఈ విషయాలు తెలుసా?.. తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి..

Shiva Prajapati

Shiva Prajapati | Edited By: Anil kumar poka

Updated on: Aug 02, 2022 | 7:16 PM

Independence Day: భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్థతను శ్రద్ధాసక్తులతో నిర్వహించటం

Independence Day: జాతీయ జెండా గురించి మీకు ఈ విషయాలు తెలుసా?.. తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి..
National Flag

Independence Day: భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్థతను శ్రద్ధాసక్తులతో నిర్వహించటం ప్రత్యేక బాధ్యత. జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో జాతీయ జండా ఎగురవేయటం జరగుతోంది. అయితే, జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా వస్తుంటాయి. ఒక్కొక్కసారి చట్ట ప్రకారం శిక్షార్హం కూడా అవుతుంది. అందుకే.. జెండా వందనం సందర్భంలో చేయవలసిన, చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. జాతీయ జెండా ఎగురవేయడానికి సంబంధించి.. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ముఖ్యమైన నియమాలు ఇలా వున్నాయి.

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా సెక్షన్ V రూల్ ప్రకారం.. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండాలో పూలు పెట్టి ఎగురవేయొచ్చు. అయితే, జెంగా ఎవరు ఎగురవేయాలనేది కూడా ఒక సమస్యగా మారింది. మరి జెండాను ఎగురు వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. విధాన నిర్ణాయక సంస్థల ప్రతినిథులు(ప్రధాని, ముఖ్యమంత్రి, జెడ్పీ చైర్మన్, గ్రామ సర్పంచ్ మొదలగు వారు) 2. కార్య నిర్వహణ సంస్థల ప్రతినిథులు (రాష్ట్రపతి, గవర్నర్, కలెక్టర్, ఎండీవో, ఎంఈవో, ఎమ్మార్వో, హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్). 3. పాఠశాలలు, కాలేజీలు కార్యనిర్వహణ సంస్థలు కావున.. పాఠశాల్లో ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో ప్రధానోపాధ్యాయులే జాతీయ జెండాను ఎగుర వేయాలి.

సాధారణ నియమాలు.! 1. జాతీయ జెండా చేనేత ఖాది, కాటన్ గుడ్డతో తయారైనది ఉండాలి. 2. జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 6300×4200 మి.మీ. నుండి 150×100 మి.మీ.వరకు మొత్తం 9 రకాలుగా పేర్కోనడం జరిగింది. 3. ప్లాస్టిక్ జెండాలు అసలే వాడరాదు. 4. పై నుండి క్రిందకు 3 రంగులు సమానంగా ఉండాలి. 5. జెండాను నేలమీదగాని, నీటి మీద పడనీయరాదు. 6. జెండాపై ఎలాంటి రాతలు, సంతకాలు, ప్రింటింగులు ఉండరాదు. 7. జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి. కిందికి వంచకూడదు. 8. జెండాను నిదనంగా(నేమ్మదిగా) ఎగురవేయాలి. 9. జెండాను ఎగురవేయడం సూర్యోదయం ముందు, దించడం సూర్యాస్తమయం లోపు చేయాలి. 10. జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకులుండాలి. 11. జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు. అది నేరం. ఎక్కడపడితే అక్కడ పడ వేయరాదు. 12. ఒకవేళ వివిధ రకాల జెండాల పక్కన ఎగుర వేయవలసి వచ్చినట్లయితే జాతీయ జెండా మిగతా వాటికంటే ఎత్తుగా ఉండాలి. 13. జెండాను ఎగుర వేయునపుడు జాతీయనాయకుల ఫోటోలు ఉంచాలి. 14. జెండాను ముందుగా 1, 2 సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కించి దించడం, మరల ఎక్కించడం చేయరాదు. 15. భావి భారత పౌరులను తీర్చిదిద్ధాల్సిన మనం జెండా వందనాన్నీ నియమ నిష్టలతో, నిబద్ధతతో, నియమాలతో చేయాలి. 16. జెండా పోల్ నిటారుగా ఉండాలి. వంకరగా ఉండరాదు. కొన్ని సార్లు విరిగిన సంధర్భాలు జరిగాయి. ఇలాంటివాటి పట్ల జాగ్రత్త వహించాలి. 17. విద్యార్థుల జేబులకు ఉంచే చిన్న జెండాలు ఎక్కడబడితే అక్కడ పడ వేయనీయరాదు. వాటిని తొక్కనీయరాదు. పిల్లలకు తప్పని సరిగా జెండా నియమాలు చెప్పి పాటింపజేయాలి. జాతీయ గేయం పాడే సమయంలో పాటించే నియమాలు చెప్పాలి. 18. డిజైన్ కోసమని.. తాళ్లకు త్రివర్ణ పతాకాలను అతికించరాదు. రంగు రంగు కాగితాలను మాత్రమే అతికించాలి. చాలా మంది రెడీమేడ్ ప్లాస్టిక్ త్రివర్ణ పతాకాలు కడుతున్నారు. వాటిని కూడా వాడరాదు.

భారత జాతీయ పతాకంలో అశోక చక్రం, ప్రత్యేకతలు..: 1. అశోకచక్రం, ధర్మచక్రం ఇందులో 24 ఆకులు (స్పోక్స్) ఉంటాయి. 2. అశోక చక్రవర్తి (273 – 232 క్రీ.పూ.) పరిపాలనా కాలంలో తన రాజధాని సారనాథ్ లోని అశోక స్థంభంపై ఈ చక్రాన్ని వేయించాడు. 3. నవీన కాలంలో ఈ అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చేరింది. 1947 జూలై 22 న జాతీయ పతాకంలో పొందుపరిచారు. 4. ఈ అశోకచక్రం తెల్లని బ్యాక్-గ్రౌండ్ లో, ‘నీలి ఊదా’ రంగులో ఉంటుంది. 5. ప్రఖ్యాత ‘సాండ్ స్టోన్’ (ఇసుకరాయి) లో చెక్కబడిన ‘నాలుగు సింహాల’ చిహ్నం. సారనాథ్ సంగ్రహాలయంలో గలదు. 6. ఇది అశోక స్థంభం పైభాగాన గలదు. 7. దీని నిర్మాణ క్రీ.పూ. 250 లో జరిగింది. భారత ప్రభుత్వము, దీనిని తన అధికారిక చిహ్నంగా గుర్తించింది.

అశోక చక్రం డిజైన్ వెనుక గల చరిత్ర, కారణాలు.. ఈ అశోకచక్రం, అశోకుడి కాలంలో నిర్మింపబడినది. ‘చక్ర’ అనేది సంస్కృత పదము, దీనికి ఇంకో అర్థం.. స్వయంగా తిరుగుతూ, కాలచక్రంలా తన చలనాన్ని పూర్తిచేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేది. ‘గుర్రం’ ఖచ్చితత్వానికీ మరియు ‘ఎద్దు’ కృషికి చిహ్నాలు.

ఈ చక్రంలో గల 24 ఆకులు (స్పోక్స్), 24 భావాలను సూచిస్తాయి.. 1. ప్రేమ (Love) 2. ధైర్యము (Courage) 3. సహనం (Patience) 4. శాంతి (Peacefulness) 5. కరుణ (kindness) 6. మంచి (Goodness) 7. విశ్వాసం (Faithfulness) 8. మృదుస్వభావం (Gentleness) 9. సంయమనం (Self-control) 10. త్యాగనిరతి (Selflessness) 11. ఆత్మార్పణ (Self sacrifice) 12. నిజాయితీ (Truthfulness) 13. సచ్ఛీలత (Righteousness) 14. న్యాయం (Justice) 15. దయ (Mercy) 16. హుందాతనం (Graciousness) 17. వినమ్రత (Humility) 18. దయ (Empathy) 19. జాలి (Sympathy) 20. దివ్యజ్ఞానం (Godly knowledge) 21. ఈశ్వర జ్ఞానం (Godly wisdom) 22. దైవనీతి (దివ్యనీతి) (Godly moral) 23. దైవభీతి (దైవభక్తి) (Reverential fear of God) 24. దైవంపై ఆశ/ నమ్మకం/ విశ్వాసం (Hope/ trust/ faith in the goodness of God.)

ఇంకా ఈ 24 ఆకులు(స్పోక్స్), 24 గంటలూ భారత ప్రగతిని సూచిస్తాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu