AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dad killed his Kids: పిల్లల్లో పాము DNA ఉంది.. రాక్షసులుగా మారతారంటూ కన్న బిడ్డలని చంపేసిన కసాయి తండ్రి..ఎక్కడంటే

serpent DNA: ఆధునిక యుగంలో అంబరాన్ని అందుకుతున్నాం.. సైన్స్ అభివృద్ధి చెందింది.. సృష్టికి ప్రతి సృష్టి చేస్తాం అంటూ ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రోజులు . అయితే కొంతమంది ఇప్పటికీ మూఢనమ్మకాలను గుడ్డిగా..

Dad killed his Kids: పిల్లల్లో పాము DNA ఉంది.. రాక్షసులుగా మారతారంటూ కన్న బిడ్డలని చంపేసిన కసాయి తండ్రి..ఎక్కడంటే
Matthew Coleman
Surya Kala
|

Updated on: Aug 15, 2021 | 8:59 AM

Share

serpent DNA: ఆధునిక యుగంలో అంబరాన్ని అందుకుతున్నాం.. సైన్స్ అభివృద్ధి చెందింది.. సృష్టికి ప్రతి సృష్టి చేస్తాం అంటూ ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రోజులు . అయితే కొంతమంది ఇప్పటికీ మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతున్నారు. మంచి చెడుల విచక్షణ మరచి.. అంధ విశ్వాసంతో ప్రవర్తిస్తూ.. మానవత్వానికే మచ్చుతునకలుగా మారుతున్నారు. తమ పిచ్చి పిచ్చి ఆలోచనలతో ప్రాణాలను తీయడానికి కూడా వెరవడం లేదు.. తాజాగా ఓ కన్న తండ్రి.. తన పిల్లలు పాము డీఎన్ఏ తో పుట్టారంటూ వారిని కర్కశంగా చంపేశాడు.. ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉల్కిపడింది. వివరాల్లోకి వెళ్తే.

లోకం తెలియని తన కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి వారి పాలిట మృత్యువుగా మారాడు. అపురూపంగా చూసుకోవాల్సిన పిల్లలను అతి దారుణంగా చంపేశాడు.. ఇలా తన పిల్లలను చంపడానికి కారణం వారు ఇద్దరూ రాక్షస జాతికి చెందినవారని.. వారిలో పాము డీఎన్ఏ ఉందని ఒక రీజన్ కూడా చెబుతున్నారు. పిల్లలని చంపడం తప్పని తనకు తెలుసు.. అయితే సమాజానికి మంచి జరగాలని తాను ఇలా పిల్లలని చంపేశానని ఓ రీజన్ కూడా చెబుతున్నాడు ఈ ప్రబుద్ధుడు.

కాలిఫోర్నియాలోని సర్ఫింగ్ స్కూల్ యజమాని మాథ్యూ టేలర్ కోల్ మన్ (40) అనే వ్యక్తి తన రెండేళ్ల, పది నెలల వయసు ఉన్న ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపేశాడు.పిల్లల్ని ట్రిప్ పేరుతొ మెక్సికో కు తీసుకువెళ్లి అక్కడే వారిని దారుణంగా హత్య చేశాడు. ఆగస్టు 7వ తేదీన కోల్ మన్ తన భార్య ను ఇంట్లోనే వదిలేసి ఇద్దరు పిల్లలను తీసుకొని బయలుదేరాడు. అయితే తన భర్తను పిల్లల్ని తీసుకుని ఎక్కడకో వెళ్లవద్దని వారించానని.. అయినా వినకుండా పిల్లల్ని తీసుకుని వెళ్లాడని కోల్ మన్ భార్య చెప్పింది.

కోల్ మెన్ భార్య చాలా సార్లు ఫోన్ చేసింది. మెసేజ్ చేసింది అయినప్పటికీ అతను స్పందించలేదు.. దీంతో భార్యకు అనుమానం వచ్చి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కోల్ మెన్ ఫోన్ ను ట్రాక్ చేసి.. అతని ఆచూకీ కనుకొన్నారు. అక్కడకు వెళ్లి అతనిని అదుపులోకి తీసుకోగా.. పిల్లలు ఇద్దరినీ తుపాకీతో కాల్చి చంపేశాని చెప్పాడు. పిల్లలు రాక్షసులుగా ఎదుగుతారని తనకు అనిపించిందని అందుకే చంపానని మాథ్యూ టేలర్ చెప్పాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

Also Read: Road Accident: భాకరాపేట ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా… 20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం