Haiti Earthquake: హైతీ భూకంపంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలమందికి గాయాలు… క్షత గాత్రులతో కిక్కిరిసిన ఆసుపత్రులు

హైతీలో సంభవించిన భూకంపంలో మరణించినవారి సంఖ్య 304 కి పెరిగింది. రిక్టర్ స్కేలుపై నమోదైన తీవ్రతను 7.2 మ్యాగ్నిట్యూడ్ గా గుర్తించారు. అనేక చోట్ల ఇళ్ళు, భవనాలు ధ్వంసమయ్యాయి, వేలమంది గాయపడినట్టు అంచనా..

Haiti Earthquake: హైతీ భూకంపంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలమందికి గాయాలు... క్షత గాత్రులతో కిక్కిరిసిన ఆసుపత్రులు
Haiti Earthquake
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 15, 2021 | 9:16 AM

హైతీలో సంభవించిన భూకంపంలో మరణించినవారి సంఖ్య 304 కి పెరిగింది. రిక్టర్ స్కేలుపై నమోదైన తీవ్రతను 7.2 మ్యాగ్నిట్యూడ్ గా గుర్తించారు. అనేక చోట్ల ఇళ్ళు, భవనాలు ధ్వంసమయ్యాయి, వేలమంది గాయపడినట్టు అంచనా.. క్షతగాత్రులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయి. శిథిలాల నుంచి బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు శతవిధాలా యత్నిస్తున్నాయి. హైతీకి వెంటనే సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. నష్టాన్ని అంచనా వేస్తామని, గాయపడినవారికి మెరుగైన వైద్య సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు వైట్ హౌస్ వెల్లడించింది. హైతీలో సంభవించిన ఈ ఘోర విపత్తు తాలూకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ హెలికాఫ్టర్ ద్వారా సర్వే చేశారు. నెల రోజుల పటు ఎమర్జెన్సీ ప్రకటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన ప్రకటించారు. భూకంపం సంభవించగానే యూఎస్ జియాలాజికల్ సర్వే సునామీ అలర్ట్ ప్రకటించింది. సముద్రపుటలలు 10 అడుగుల ఎత్తు వరకు ఎగసి పడవచ్చునని పేర్కొంది. అయితే కొద్ది సేపటికి ఈ హెచ్చరికను ఉపసంహరించింది.

హైతీలో 2010 లో సంభవించిన భూకంపంలో రెండు లక్షల మంది మరణించగా దాదాపు 3 లక్షలమంది గాయపడ్డారు. నాటి విపత్త్తును తలచుకుని ఇప్పటికీ హైతీవాసులు భయంతో వణికిపోతున్నారు. తమ కళ్లెదుటే బహుళ అంతస్థుల హోటల్ ఒకటి కుప్ప కూలిపోవడాన్ని చూసి వందలమంది పరుగులు తీశారు. కేతడ్రిల్ చర్చి సైతం పూర్తిగా నాశనమైంది.

మరిన్ని ఇక్కడ చూడండి: SBI Raksha Bandhan Offer: రాఖీ పండుగ ఎఫెక్ట్.. ఎస్‌బిఐ బంపర్ ఆఫర్.. ఈ యాప్‌తో షాపింగ్ చేస్తే..

Neem Face Pack: అందమైన ముఖం కోసం వేప ఫేస్ ప్యాక్.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Latest Articles