SBI Raksha Bandhan Offer: రాఖీ పండుగ ఎఫెక్ట్.. ఎస్‌బిఐ బంపర్ ఆఫర్.. ఈ యాప్‌తో షాపింగ్ చేస్తే..
SBI Raksha Bandhan Offer: రాఖీ పండుగను పురస్కరించుకుని ఎస్‌బిఐ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్..
SBI Raksha Bandhan Offer: రాఖీ పండుగను పురస్కరించుకుని ఎస్‌బిఐ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రక్షా బంధన్ నేపథ్యంలో ఆన్‌లైన్ కోనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. గతేడాది మాదిరిగా కాకుండా.. కాస్త పరిస్థితులు అనుకూలించడంతో.. ప్రజలుు షాకింగ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. దాంతో మార్కెట్లలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటోంది. అయితే, కరోనా నేపథ్యంలో తాము ఆన్‌లైన్ షాపింగ్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడుతున్నామని, తమ కస్టమర్లను శ్రేయస్సు కోసం ఆన్‌లైన్ షాపింగ్‌నే ప్రోత్సహిస్తున్నామని ఎస్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా ఎస్‌బిఐ రక్షా బంధన్ ఆఫర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.
రక్షా బంధన్ నేపథ్యంలో తమ సోదరీమణుల కోసం బహుమతులు కొనాలనుకునే వారికి ఈ ఆఫర్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆన్‌లైన్ కొనుగోళ్లపై డిస్కౌంట్ ప్రయోజనం లభిస్తుంది. ఎస్‌బిఐ ప్రకారం.. ఫెర్న్స్ యాంట్ పెటల్స్ కంపెనీ బహుమతి కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. అయితే, ఈ ఆఫర్ రూ .999 వరకు బహుమతులపై మాత్రమే వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి, వినియోగదారులు SBI యోనో యాప్‌ని ఉపయోగించాలి. ఈ యాప్ ద్వారా మీరు డిస్కౌంట్ ప్రయోజనాన్ని పొందుతారు.
బహుమతి కొనుగోళ్లపై 20% వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందడానికి కస్టమర్లు యోనో యాప్ ద్వారానే చెల్లింపులు జరపాలి. ఈ ఆఫర్‌కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే.. SBI YONO, sbiyono.sbi అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. SBI తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ఆఫర్ గురించిన సమాచారం ఇచ్చింది. పెద్ద ఆఫర్‌తో రక్షా బంధన్ పండుగను జరుపుకోండి అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘ఫెర్న్స్ ఎన్ పెటల్స్ వద్ద షాపింగ్ చేయండి, 20శాతం తగ్గింపు పొందండి. SBI YONO నుండి రూ .999 కొనుగోలుపై ఈ ప్రయోజనం ఇవ్వబడుతుంది. యోనో SBI యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి sbiyono.sbi/index.html పై క్లిక్ చేయండి.’’ అని ఎస్‌బిఐ ట్వీట్ చేసింది.
ఈ ఆఫర్ ఎంతకాలం ఉంటుంది.. ఎస్‌బిఐ ఆఫర్ ఆగస్టు 22 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రాఖీ పండుగ ఆగస్టు 22 న ఉంది, ఆ రోజు వరకు 20 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో కనీస కొనుగోలు పరిమితి లేదు. అయితే, గరిష్ట పరిమితి రూ .999 గా నిర్ణయించబడింది. రూ .999 వరకు మాత్రమే కొనుగోళ్లపై 20 శాతం డిస్కౌంట్ ప్రయోజనం లభిస్తుంది. దీని కోసం SBI ఒక కోడ్ జారీ చేసింది. ఈ కోడ్ నంబర్ SBI20 ఇది షాపింగ్ చేసేటప్పుడు అప్లై చేయాలి.
వినియోగదారుల కోసం మరో ఆఫర్.. జీవన్‌శైలి స్టోర్.కామ్ నుండి వస్తువుల కొనుగోలుపై 60% వరకు తగ్గింపు లభిస్తుంది. డ్రెస్సులతో సహా ఈ స్టోర్ నుండి లగ్జరీ వస్తువులు, ఫ్యాషన్ వస్తువులు కొనుగోలు చేయొచ్చు. వీటి కోసం చెల్లింపులను యోనో యాప్ ద్వారా చేయాల్సి ఉంటుంది. అలా అయితే, ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒక కస్టమర్ SBI కార్డ్‌తో కొనుగోలు చేస్తే, అతనికి 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇవ్వబడుతుంది.
Celebrate Raksha Bandhan with this BIG offer. Shop at fernsnpetals and get flat 20% discount up to ₹999 through YONO SBI. Download YONO SBI app now: https://t.co/NeeHLbI8DP#YONOSBI #fernsnpetals #RakshaBandhan #Offers #Discount #SBI #StateBankOfIndia pic.twitter.com/zxEXna3TnQ
— State Bank of India (@TheOfficialSBI) August 12, 2021
Also read:
YS Viveka Murder Case: ‘‘పెద్దలతో పెట్టుకునే శక్తి లేదు.. నాకు ప్రాణ హానీ ఉంది’’: మణికంఠ రెడ్డి
Earthquake in Haiti: హైతీలో భారీ భూకంపం.. 29 మందికి పైగా మృతి.. శిథిలాల్లో చిక్కుకున్న వందలాదిమంది..