Japan Floods: ఎడతెరిపిలేని వానలతో నీటమునిగిన ప్రధాన నగరాలు.. ఎవరి ప్రాణలకు వారే భాధ్యులు.. అక్కడ సర్కార్ కీలక ప్రకటన

Japan Floods: జపాన్‌ను జలప్రళయం ముంచెత్తనుందా అంటే.. అక్కడ పరిస్థితులు అవుననే అనిపించే విధంగానే ఉన్నాయి. ఆ దేశంలో అతి భారీ వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే హిరోషిమా సహా ఎనిమిది..

Japan Floods: ఎడతెరిపిలేని వానలతో నీటమునిగిన ప్రధాన నగరాలు.. ఎవరి ప్రాణలకు వారే భాధ్యులు.. అక్కడ సర్కార్ కీలక ప్రకటన
Japan Floods
Follow us
Surya Kala

|

Updated on: Aug 15, 2021 | 7:36 AM

Japan Floods: జపాన్‌ను జలప్రళయం ముంచెత్తనుందా అంటే.. అక్కడ పరిస్థితులు అవుననే అనిపించే విధంగానే ఉన్నాయి. ఆ దేశంలో అతి భారీ వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే హిరోషిమా సహా ఎనిమిది.. ప్రధాన నగరాల్లో జపాన్‌ వాతావరణ విభాగం హై ఎలర్ట్ ను జారీ చేసింది. కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చునని దీంతో ఈ నగరాల్లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం కూడా ఉండకపోవచ్చునని ప్రజల్ని హెచ్చరించింది.

జపాన్‌లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాయవ్య జపాన్‌లోని సాగా, నాగసాకి, ఫుకోకా రాష్ట్రాల్లో ఐదవ నెంబరు ప్రత్యేక ప్రమాద వాతావరణ హెచ్చరికను జారీ చేసింది. ప్రభుత్వం. ఈ ప్రాంతంలోని పలు నదులుల ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో అంతకుముందే హిరోషిమా నగరంలో కూడా ఇదే హెచ్చరికను జారీ చేశారు. అన్ని ప్రధాన నదులకు వరద నీరు పొటెత్తుతోంది. అన్ని నదులు కూడా ప్రమాదకర స్థాయి దాటి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా అధికారులకు సాధ్యం కావడం లేదు. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రజా జీవనం స్తంభించింది. అసలు అక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది.

అటు ప్రజలు కూడా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల పై కప్పులకు చేరుకున్నారు. తమ జీవితాలు కాపాడమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దాదాపు పది లక్షల మంది ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు వీలైనంత త్వరగా ఇళ్లు ఖాళీ చేయాలని జపాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు వరద నీటితో భారీగా బురద కూడా వస్తోంది. బురద కారణంగా ఇప్పటికే పది మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. వర్షపునీటి ప్రవాహానికి ట్రక్కు వేగంగా కొట్టుకుపోతున్న దృశ్యం వైరల్‌ అవుతోంది.

ప్రజలు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి ఏం చర్యలు తీసుకోగలరో వాటిని తీసుకోవాల్సిన అవసరం వుందని అధికారులు తెలిపారు పది లక్షల మంది ప్రజలకు పైగా ఈ అత్యున్నత స్థాయి హెచ్చరికలు వర్తిస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. మరో 17 రాష్ట్రాల్లోని 4.5 లక్షలమంది ప్రజలకు నెంబరు 4 హెచ్చరికను జారీ చేసింది.

Also Read: Independence Day: దేశభక్తిని వినూత్నంగా చాటుకున్న యువరైతులు.. పొలంలో భారత ఆకృతిని సృష్టించిన అన్నదాతలు

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?