మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో మహిళా కార్పొరేటర్‌పై దాడి.. మీర్‌పేట కార్పొరేటర్ ముద్ద పవన్ అరెస్ట్

మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మహిళా కార్పొరేటర్‌పై దాడి చేసిన మీర్‌పేట కార్పొరేటర్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కార్పొరేటర్‌తోపాటు మరో ఆరుగురిని అదుపులోకి..

మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో మహిళా కార్పొరేటర్‌పై దాడి.. మీర్‌పేట కార్పొరేటర్ ముద్ద పవన్ అరెస్ట్
Follow us
Subhash Goud

|

Updated on: Aug 14, 2021 | 10:10 PM

మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మహిళా కార్పొరేటర్‌పై దాడి చేసిన మీర్‌పేట కార్పొరేటర్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కార్పొరేటర్‌తోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 12వ తేదీన ఉదయం 11.30 గంటలకు మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు స్థానిక విద్యావాణి స్కూల్‌లో హాజరయ్యారు. 13వ తేదీన నిర్వహించనున్న జనరల్ బాడీ మీటింగ్ ఎజెండా గురించి చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే పదో డివిజన్ కార్పొరేటర్ ముద్దా పవన్ కుమార్ సమావేశానికి తన అనుచరులతో వచ్చి టేబుల్‌పై ఉన్న వాటర్ బాటిళ్లు విసిరికొట్టాడు. సమావేశంలో ఉన్న కార్పొరేటర్ జిల్లా విజయ్‌కుమార్, జిల్లా సౌందర్యపై వాటర్ బాటిల్ విసిరేసాడు. అంతటితో ఆగకుండా ఫర్నీచర్‌ను ధ్వంసం దీంతో కార్పొరేటర్ జిల్లా సౌందర్య మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు కార్పొరేటర్ ముద్ద పవన్‌కుమార్, సయిద్ ఆరిఫ్ పాషా, శేషు భట్కర్‌అనిల్‌కుమార్, ఆలూరి వికాస్ వర్మ, వేముల విజయ్‌ను అరెస్టు చేసిరిమాండ్‌కు తరలించారు. అయితే వీరిపై 599/2021, U/ 147, 148, 354, 324, 504, 506, 427 R/W 149 IPC సెక్షన్‌ 3 (1) (R) (S), 3 (1) (W) (I), అలాగే SEC 3 (2) (V) (ఎ) ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇవీ కూడా చదవండి

Kurnool: కర్నూలు పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర సెబ్ అధికారుల తనిఖీలు.. ఆశ్చర్యపోయిన పోలీసులు

పట్టపగలు బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ యువజన నేత కాల్చివేత.. అయిదుగురి అరెస్ట్

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!