India Inline Hockey: భారత ఇన్‌లైన్ హాకీ టీమ్‌కు ఎంపికైన ప్రీతి నిగమ్, నగేష్‌ల తనయుడు ఆర్యన్

Inline Hockey: నటీనటుల పిలల్లు తల్లిదండ్రుల బాటలో నడుస్తూ.. నటనలో వారసులుగా కావాలని చాలామంది కోరుకుంటారు. అయితే కొంతమంది మాత్రమే తల్లిదండ్రుల ఫేమ్ ని పక్కకు పెట్టి.. తమకంటూ సొంత ఐడెంటిని..

India Inline Hockey: భారత ఇన్‌లైన్ హాకీ టీమ్‌కు ఎంపికైన ప్రీతి నిగమ్, నగేష్‌ల తనయుడు ఆర్యన్
Karra Nagesh
Follow us
Surya Kala

|

Updated on: Aug 15, 2021 | 1:27 PM

India Inline Hockey: నటీనటుల పిలల్లు తల్లిదండ్రుల బాటలో నడుస్తూ.. నటనలో వారసులుగా కావాలని చాలామంది కోరుకుంటారు. అయితే కొంతమంది మాత్రమే తల్లిదండ్రుల ఫేమ్ ని పక్కకు పెట్టి.. తమకంటూ సొంత ఐడెంటిని క్రియేట్ చేసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు.. తమదైన శైలిలో కెరీర్ కు బాటలు వేసుకుంటారు. అలాంటి యూత్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. మనం ముందుగా హీరో మాధవన్ తనయుడు, సుహాసిని మణిరత్నంకుమారుడితో పాటు.. ప్రీతినిగమ్, కర్రా నగేష్ ల తనయుడు గురించి కూడా చెప్పుకోవాలి.

బుల్లి తెరతో పాటు, సినిమాల్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ప్రీతినిగమ్ , కర్రా నగేష్ దంపతుల కుమారుడు ఆర్యన్ భారత దేశం తరపున ఇన్‌లైన్ హాకీ టీమ్‌ లో ఆడదానికి ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్యన్ ను రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇన్‌లైన్ హాకీ జట్టు సభ్యుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆర్యన్ చండీగఢ్ లో స్పెషల్ కోచింగ్ తీసుకుంటున్నాడు.

ఇటలీలోని రొక్కరాసో లో జరగనున్న 2021 వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో భారత సీనియర్ మెన్ ఇన్‌లైన్ హాకీ టీమ్‌ పాల్గొననుంది. ఈ టీమ్ లో ఆర్యన్ కూడా ఒక సభ్యుడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఆర్యన్ కర్రా ప్రస్తుతం అబిడ్స్‌లోని సెయింట్ జోస్పె డిగ్రీ కళాశాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని అనేక పతకాలను సొంతం చేసుకున్నాడు. దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్ 2018 లో ఆర్యన్ కర్రా కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఎల్బి స్టేడియంలో శ్రీ జితేందర్ గుప్తా మార్గదర్శకత్వంలో రోలర్ స్కేటింగ్ కెరీర్‌ను ప్రారంభించిన ఆర్యన్ ప్రస్తుతం జాతీయ కోచ్ శ్రీ జి. సత్య వద్ద శిక్షణ పొందుతున్నాడు.

Also Read: TV Serial-Jr. NTR: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు సీరియల్‌లో నటించిన నందమూరి హీరో..