AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Javelin Throw: 1984 ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో తృటిలో కాంస్యం కోల్పోయిన క్రీడారుడినేను ఆదుకోండి ప్లీజ్ అంటున్న వైనం

Javelin Throw: టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడంతో జావెలిన్ త్రో కు ఎనలేని ప్రాచుర్యం లభించింది. ఐతే నీరజ్ చోప్రా కంటే ముందు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సుబేదార్ సర్నామ్ సింగ్ జావెలిన్ త్రో..

Javelin Throw: 1984 ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో తృటిలో కాంస్యం కోల్పోయిన క్రీడారుడినేను ఆదుకోండి ప్లీజ్ అంటున్న వైనం
Javelin Throw Winner
Surya Kala
|

Updated on: Aug 15, 2021 | 1:58 PM

Share

Javelin Throw: టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడంతో జావెలిన్ త్రో కు ఎనలేని ప్రాచుర్యం లభించింది. ఐతే నీరజ్ చోప్రా కంటే ముందు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సుబేదార్ సర్నామ్ సింగ్ జావెలిన్ త్రో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. అనేక పతకాలను దేశానికి అందించారు. బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధించిన సర్నామ్ సింగ్ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రీడాకారుడు భూమిని పొరుగువారు లాక్కున్నా మౌనంగా భరించారు.. బోరుబావిని కూల్చేసి ఇబ్బందీపాలు చేస్తున్నా చూస్తూ ఊరుకున్నారు.. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఈ ఆర్మీ జవాన్.

970 లో భారత ఆర్మీ లో చేరిన సర్నాం సింగ్‌.. జావెలిన్‌ త్రో క్రీడలో అద్భుత ప్రదర్శన చేశారు. 1982 ఒలింపిక్స్‌కు భారత్‌ తరఫున పాల్గొన్న సర్నామ్ సింగ్ తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచారు. 1984 లో కాట్మండులో జరిగిన ఆసియా క్రీడల్లో 78.58 మీటర్ల దూరం జావెలిన్‌ను త్రో చేసి పసిడి పతకాన్ని పట్టేశారు. అనంతరం ఇండోనేషియా, జర్మనీ, పాకిస్తాన్‌లలో జరిగిన క్రీడల్లో పాల్గొని పలు పతకాలను సాధించారు.  ఇక జాతీయ స్థాయి పోటీల్లో సర్నామ్ సింగ్ ఏడు పసిడి పతకాలను సాధించారు. ఆర్మీలో పదోన్నతి పొంది చివరకు 2001 అక్టోబర్‌ 1 న రిటైర్‌ అయ్యారు. అయితే అప్పటి నుంచి ఈ క్రీడాకారుడికి కష్టాలు మొదలయ్యాయి.

ఆగ్రా పరిధిలోని ధోల్‌పూర్‌లో సుబేదార్‌ సర్నాం సింగ్‌కు కొంత భూమి ఉంది. దానిని పొరుగింటి వారు ఆక్రమించుకున్నారు. ఇదే విషయంపై ఎన్నిసార్లు ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దేశానికి ఆర్మీ జవానుగా సేవ చేయడమేకాదు.. క్రీడాకారుడిగా దేశ విదేశాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సర్నామ్ సింగ్ ఇప్పుడు ధోల్‌పూర్‌లోనే ఒక కిరాయి ఇంట్లో భార్య, పిల్లలతో జీవిస్తున్నారు.ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించినా.. అప్పటి ప్రభుత్వం తనకు ఎలాంటి ప్రోత్సాహకం ఇవ్వలేదని, కనీసం ఒక గుర్తింపు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన భూమి తనకు ఇప్పించాలని కోరుతున్నారు.

Also Read:  వివిధ రాష్ట్రాల్లో మహిళలు ధరించే గాజుల వెనుక రీజన్ ఏమిటో తెలుసా..