Neeraj Chopra: ‘విజయానికి షార్ట్‌కట్స్ తీసుకోకండి.. కష్టపడితేనే అద్భుత ఫలితం’: యువతకు ఒలింపిక్ గోల్డెన్ బాయ్ సందేశం

"మిమ్మల్ని మీరు నమ్మండి, మీ కోచింగ్‌ని నమ్మండి.. అంతేకాని విజయానికి షార్ట్‌కట్‌లు తీసుకోకండి" అంటూ ఒలింపిక్‌లో బంగారు పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రా అన్నారు.

Neeraj Chopra: 'విజయానికి షార్ట్‌కట్స్ తీసుకోకండి.. కష్టపడితేనే అద్భుత ఫలితం': యువతకు ఒలింపిక్ గోల్డెన్ బాయ్ సందేశం
Neeraj Chopra
Follow us
Venkata Chari

|

Updated on: Aug 15, 2021 | 9:10 PM

స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాతోపాటు భారతదేశం తరపున టోక్యో ఒలింపిక్స్‌ వెళ్లిన క్రీడాకారులంతా ఆదివారం ఎర్రకోటలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. టోక్యోలో తన రికార్డ్ బ్రేకింగ్ ఫీట్ కారణంగా దేశంలో ఓ స్టార్‌గా మారిపోయిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. యువకుల కోసం ఒక సందేశాన్ని అందించాడు. “మిమ్మల్ని మీరు నమ్మండి, మీ కోచింగ్‌ని నమ్మండి. అంతేకాని విజయానికి షార్ట్‌కట్‌లు తీసుకోకండి” అంటూ పిలుపినిచ్చాడు. జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకకు ముందు, నీరజ్ చోప్రా మాట్లాడుతూ, ఇంతకు ముందు తాను టీవీలో ఈ వేడుకను చూసేవాడిని, ప్రస్తుతం ఈ వేడుకకు హాజరయ్యాయనని, ఇది తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని అన్నారు.

అలాగే ఈ ఆగస్టు 15 వేడుకల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు పీఎం మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “అసలు ఇంత త్వరగా నిద్రలేచే అలవాటు తనకు తేదని” నీరజ్ చమత్కరించాడు. అయితే రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోన్న నీరజ్‌కు మాములు ఫీవర్‌గా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే నేడు తన ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించాడు. అయితే డాక్టర్లు కొద్దిగా విశ్రాంతి తీసుకోమని చెప్పారంటూ తెలిపాడు. నీరజ్ చోప్రా టోక్యో గేమ్స్‌లో చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఆదివారం, ప్రధాని మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మాట్లాడుతూ.. ‘ఒలింపియన్లు దేశానికి కీర్తిని తెచ్చారని, మన హృదయాలను గెలుచుకోవడమే కాదు.. మన యువ తరానికి స్ఫూర్తిని కలిగించారని” ప్రధాని ప్రశంసించారు.

ఒలింపిక్స్‌లో ఈసారి భారతదేశం అత్యుత్తమ పతకాలు సాధించింది. మొత్తం ఏడు పతకాలు గెలుచుకుంది. 2012 లండన్ గేమ్స్‌లో ఆరు పతకాలను మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసింది. “ఒకప్పుడు క్రీడలకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదని, ప్రస్తుతం తల్లిదండ్రుల ధోరణి మారుతోందని, దేశంలో క్రీడలతోపాటు ఫిట్‌నెస్‌పై అవగాహన వచ్చిందని” ప్రధాని మోదీ పేర్కొన్నారు. “ఇది మన దేశానికి ఒక ప్రధాన మలుపు. ఈ దశాబ్దంలో దేశం క్రీడలలో ప్రతిభ, సాంకేతికత, వృత్తి నైపుణ్యాన్ని తీసుకొచ్చేందుకు మేము మరింతగా పనిచేస్తామని” ప్రధాని పేర్కొన్నారు.

Also Read: MS Dhoni: భారత సైన్యం పట్ల ధోని అభిరుచికి ఈ కల్నల్ సెల్యూట్.. మిస్టర్ కూల్ ఫొటో షేర్ చేస్తూ ఏమన్నాడంటే..!

IND vs ENG Lords Test: నోబాల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన టీమిండియా పేసర్.. జహీర్ ఖాన్ చెత్త రికార్డుకు బ్రేక్.. రెండో టెస్టులో ఏకంగా..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!