AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: భారత సైన్యం పట్ల ధోని అభిరుచికి ఈ కల్నల్ సెల్యూట్.. మిస్టర్ కూల్ ఫొటో షేర్ చేస్తూ ఏమన్నాడంటే..!

చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో కల్నల్ వెంబు శంకర్ వీడియోను పంచుకుంది. ఇందులో అతను ధోనీతో జరిగిన ఓ సంఘటనను ప్రస్తావించారు.

MS Dhoni: భారత సైన్యం పట్ల ధోని అభిరుచికి ఈ కల్నల్ సెల్యూట్.. మిస్టర్ కూల్ ఫొటో షేర్ చేస్తూ ఏమన్నాడంటే..!
Dhoni
Venkata Chari
|

Updated on: Aug 15, 2021 | 7:11 PM

Share

MS Dhoni: భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొంది. ఈ ప్రత్యేక సందర్భంలో మహేంద్ర సింగ్ ధోని ఇండియాలో లేడు. ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచులు ఆడేందుకు దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. భారత సైన్యం పట్ల ధోని ప్రేమ, నమ్మకం గురించి అందరికీ తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించిన సంగతి తెలిసిందే. 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, భారత సైన్యం కల్నల్, వెంబు శంకర్ ధోనీకి ప్రశంసలతో ముంచెత్తారు. భారత సైన్యం, దేశం పట్ల ధోని అభిమానానికి కల్నల్ శంకర్ వందనం చేశారు.

చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో కల్నల్ వెంబు శంకర్ వీడియోను పంచుకుంది. ఇందులో అతను ధోనీతో జరిగిన ఓ సంఘటనను ప్రస్తావించారు. ఈ వీడియోలో, కల్నల్ శంకర్.. ధోనీలు ఇండియన్ ఆర్మీ అనే నాణేనికి రెండు వైపులా ఉన్నారని, దానిని వేరు చేయలేమని చెబుతున్నట్లు కనిపిస్తోంది.

ఎంఎస్ ధోనీ కవాతు నైపుణ్యాలు అద్భుతమైనవని భారత సైన్యం కల్నల్ అన్నారు. నేను 20 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నప్పటికీ, నాకంటే మెరుగ్గా కవాతు చేస్తాడని తెలిపాడు. కల్నల్ శంకర్ మాట్లాడుతూ.. ‘ధోనీకి, భారత సైన్యానికి మధ్య చాలా ప్రేమ ఉంది. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ ప్రేమను దగ్గర నుంచి చూశాను. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత జెర్సీలో సైన్యం దుస్తుల్లో మార్పును గమనిస్తే ఆవిషయం తెలుస్తుందని’ అని అన్నారు.

ధోని ప్రస్తుతం సీఎస్‌కే టీంతో దుబాయం‌లో ఉన్నాడు. క్వారంటైన్ ముగిసిని తరువాత తోటి ఆటగాళ్లతో ఐపీఎల్ 2021 కోసం సిద్ధమవనున్నాడు. ఐపీఎల్ 2021లో మిగిలిన 31 మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. మొదటి మ్యాచ్ చెన్నై వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సి ఉంది.

Also Read: IND vs ENG Lords Test: నోబాల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన టీమిండియా పేసర్.. జహీర్ ఖాన్ చెత్త రికార్డుకు బ్రేక్.. రెండో టెస్టులో ఏకంగా..!

IND vs ENG 2nd Test: టెస్టుల్లో టీమిండియాకు కలిసిరాని ఆగస్టు 15.. పేలవ రికార్డులు.. లార్డ్స్‌లో అదే రిపీట్ కానుందా?

లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా