AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: హీటెక్కిన లార్డ్స్ టెస్ట్‌.. విరాట్ కోహ్లీ-జేమ్స్ ఆండర్సన్‌ల మధ్య మాటల యుద్ధం.. టీమిండియా కెప్టెన్‌పై చర్యలు?

Ind vs ENG: విరాట్ కోహ్లీ, జేమ్స్ ఆండర్సన్ మధ్య గత ఏడు సంవత్సరాలుగా పోటీ జరుగుతోంది. ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే వీరి మధ్య యుద్ధం మొదలైంది.

IND vs ENG: హీటెక్కిన లార్డ్స్ టెస్ట్‌.. విరాట్ కోహ్లీ-జేమ్స్ ఆండర్సన్‌ల మధ్య మాటల యుద్ధం.. టీమిండియా కెప్టెన్‌పై చర్యలు?
Kohli Anderson
Venkata Chari
|

Updated on: Aug 15, 2021 | 9:30 PM

Share

ఇండియా-ఇంగ్లాండ్ టీంల మధ్య లార్డ్స్ టెస్ట్ సందర్భంగా విరాట్ కోహ్లీ, జేమ్స్ ఆండర్సన్‌ల మధ్య గొడవ జరిగింది. ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ సంఘటన రెండవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగింది. నేడు నాలుగో రోజు టీమండియా బ్యాటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం స్టంప్ మైక్‌లో రికార్డ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది.కోహ్లీ వర్సెస్ ఆండర్సన్ సిరీస్‌కు ముందే బాగా ప్రచారంలో ఉంది. భారత ఇన్నింగ్స్ 17 వ ఓవర్‌లో, విరాట్ కోహ్లీ.. జేమ్స్ ఆండర్సన్‌తో ఏదో మాట్లాడిన వీడియో బయటపడింది. నాన్-స్ట్రైక్ ఎండ్‌లోని స్టంప్ మైక్‌లో కోహ్లీ మాటలు రికార్డ్ అయ్యాయి. విరాట్ కోహ్లీ.. అండర్సన్‌తో మాట్లాడుతూ, మీరు నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? లేదా బుమ్రాపై కోపంగా ఉన్నారా? ఇది మీ ఇంటి జాగా కాదు అంటూ మాట్టాడాడు. దీని తర్వాత జేమ్స్ ఆండర్సన్ కోహ్లీని కోపంగా చూస్తూ దగ్గరికి రాబోయాడు.

Kohli Anderson 2

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో విరాట్ కోహ్లీ కూడా అసభ్యకరమైన పదాలను ఉపయోగించాడని తెలుస్తోంది. అయితే దీని తర్వాత వారు చెప్పే మాటలు స్పష్టంగా వినిపించడం లేదు. కానీ, ఈ సమయంలో కోహ్లీ-ఆండర్సన్‌ల మధ్య మాటలు వేడెక్కినట్లు స్పష్టమవుతోంది. అయితే, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం, అంతర్జాతీయ మ్యాచ్‌లో అసభ్యకరమైన పదాలను ఉపయోగించడం నేరం. 2014 సిరీస్ నుంచి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ- జేమ్స్ ఆండర్సన్‌ల మధ్య గట్టి పోటీ ఉంది. 2014లో ఇండియా.. ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు, జేమ్స్ ఆండర్సన్ ముందు కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. కానీ, 2018 పర్యటనలో, కోహ్లీ బలమైన పునరాగమనం చేశాడు. రెండు సెంచరీలు సాధఇంచాడు. అలాగే, అండర్సన్ బౌలింగ్‌లో ఒక్కసారి కూడా కాలేదు. కానీ, ఇటీవలి పర్యటనలో, ఆండర్సన్ ఇప్పటికే విరాట్ కోహ్లీని తొలి టెస్ట్‌లోనే గోల్డెన్ డక్ చేశాడు. ఇదిలా ఉంటే, లార్డ్స్ టెస్ట్ మూడవ రోజు, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. జేమ్స్ ఆండర్సన్ మీద షార్ట్ పిచ్ బాల్స్ వర్షం కురిపించాడు. ఆట ముగిసిన తర్వాత, అండర్సన్, టీమిండియా ఆటగాళ్ల మధ్య మాటల దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Kohli Anderson

విరాట్ కోహ్లీ ఈ పర్యటనలో ఘోరంగా విఫలమవుతున్నాడు. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 20 పరుగులు చేసిన తర్వాత సామ్ కరన్ బౌలింగ్‌లో పెవలియన్ చేరాడు. ఈ సిరీస్‌లో అతను హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్ 42 పరుగులు చేశాడు. ప్రస్తుత సిరీస్‌లో మూడు టెస్టులు అంటే ఆరు ఇన్నింగ్స్‌లు మిగిలి ఉన్నాయి. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడో చూడాలి.

Also Read:

MS Dhoni: భారత సైన్యం పట్ల ధోని అభిరుచికి ఈ కల్నల్ సెల్యూట్.. మిస్టర్ కూల్ ఫొటో షేర్ చేస్తూ ఏమన్నాడంటే..!

Neeraj Chopra: ‘విజయానికి షార్ట్‌కట్స్ తీసుకోకండి.. కష్టపడితేనే అద్భుత ఫలితం’: యువతకు ఒలింపిక్ గోల్డెన్ బాయ్ సందేశం

IND vs ENG Lords Test: నోబాల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన టీమిండియా పేసర్.. జహీర్ ఖాన్ చెత్త రికార్డుకు బ్రేక్.. రెండో టెస్టులో ఏకంగా..!