- Telugu News Photo Gallery Cricket photos Ind vs england teamindia to bat on 15th august for the 4th time check the previous records here
IND vs ENG 2nd Test: టెస్టుల్లో టీమిండియాకు కలిసిరాని ఆగస్టు 15.. పేలవ రికార్డులు.. లార్డ్స్‌లో అదే రిపీట్ కానుందా?
ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజున భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది. భారత జట్టు ఈ రోజు తమ విజయాన్ని నిర్ణయించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Updated on: Aug 15, 2021 | 4:35 PM

ఈ రోజు ఆగస్టు 15. 1947వ సంవత్సరంలో బ్రిటిష్ వారి 200 సంవత్సరాల బానిసత్వం నుంచి భారతదేశం స్వేచ్ఛ పొందిన రోజు. ఈ రోజు భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడటం యాదృచ్చికంగా జరిగింది. లార్డ్స్‌లో జరుగుతున్న ఈ సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్‌లో నేడు నాలుగో రోజు.

భారత జట్టు నాలుగో రోజు బ్యాటింగ్ చేస్తుంది. ఇప్పటివరకు భారత జట్టు ఆగస్టు 15న బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సందర్భాలు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. టీమిండియాకు ఈ రోజు ప్రత్యేకమైనది కానప్పటికీ.. దాదాపు ప్రతీసారి భారత్ చిన్న స్కోరుకే ఆలౌట్ అయింది.

1952లో, ఇంగ్లండ్‌పై టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఆగష్టు 15న వర్షం కారణంగా ఆట పూర్తి కాలేదు. అప్పుడు భారత స్కోరు 49/5. దీని తర్వాత, దాదాపు 50 సంవత్సరాల తరువాత, 2001వ సంవత్సరంలో భారతదేశం ఆగస్టు 15న బ్యాటింగ్ చేసింది. ఈసారి శ్రీలంకపై బ్యాటింగ్ చేసింది. కేవలం 187 పరుగులకు ఆలౌట్ అయింది.

2014 సంవత్సరంలో కూడా ఆగస్టు 15న ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం భారతదేశానికి లభించింది. జట్టు ఇక్కడ కూడా ఆకట్టుకోలేక పోయింది. కేవలం 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆగస్టు 15, 2015లో చివరిసారిగా భారత జట్టు టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసింది. శ్రీలంకపై భారత జట్టు కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆగస్ట్ 15న భారత జట్టుకు పేలవమైన రికార్డు ఉంది. లార్డ్స్ టెస్ట్‌పై ఈ ప్రభావం పడకుండా ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొదటి టెస్టులో భారత్ విజయానికి చాలా దగ్గరగా వచ్చింది. కానీ, వర్షంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అదే సమయంలో, రెండో టెస్టులో భారత జట్టు ఇప్పుడు రెండోసారి బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఏం చేస్తారో చూడాలి.





























