Tips For Black Heads: ముక్కుపై బ్లాక్స్‌హెడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. ఈ వంటింటి చిట్కాలు అప్లై చేసి చూడండి

Tips For Black Heads: అందమైన ముఖం అందరినీ ఆకర్షిస్తుంది.. అందుకనే అందమైన ఆకర్షణీయమైన ముఖాన్ని అందరూ కోరుకుంటారు.. అయితే ప్రస్తుతం వాతావరణం కాలుష్యంతో..

Tips For Black Heads: ముక్కుపై బ్లాక్స్‌హెడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. ఈ వంటింటి చిట్కాలు అప్లై చేసి చూడండి
Black Heads Tips
Follow us
Surya Kala

|

Updated on: Aug 16, 2021 | 7:53 AM

Tips For Black Heads: అందమైన ముఖం అందరినీ ఆకర్షిస్తుంది.. అందుకనే అందమైన ఆకర్షణీయమైన ముఖాన్ని అందరూ కోరుకుంటారు.. అయితే ప్రస్తుతం వాతావరణం కాలుష్యంతో నిండిపోయింది. దీంతో కాలుష్యంలో తిరగడం వలన ముక్కుమీద బ్లాక్ హెడ్స్ ఏర్పడి.. మురుకుతో కూడిన మచ్చలు ఏర్పడుతున్నాయి. అవి ముఖం అందంపై ప్రభావం చూపిస్తాయి. మరి ఆ బ్లాక్స్ హెడ్స్ ను రిమూవ్ చేయాలంటే సింపుల్ చిట్కాలను ట్రై చేసి చూడండి..

నిమ్మరసం-తేనే:

అర చెక్క నిమ్మకాయ రసం తీసుకుని ఒక రెండు చుక్కలు తేనే వేసి కలిపి ముక్కు చుట్టూ అప్లై చేయాలి. దీంతో ముక్కు దగ్గర ఉన్న నలుపు, బ్లాకు హెడ్స్ పూర్తిగా పోతాయి. ఇలా రోజు విడిచి రోజు కొన్ని రోజులపాటు చేస్తే.. ముక్కుమీద బ్లాక్ హెడ్స్ తప్పనిసరిగా తగ్గుతాయి.

వంట సోడా:

కొద్దిగా వంట సోడాలో నీరు వేసి పేస్టులా చేసి ముక్కు చుట్టూ బ్లాక్ హెడ్స్ పై అప్లై చేయాలి.. తర్వాత ఒక 10 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగివేస్తే చాలా తొందరగా నల్లగా గరుకుగా ఉన్న ముక్కు నున్నగా అవుతుంది.

శనగపిండి:

ముక్కు పై కొంచెం నువ్వుల రాసి.. కొంచెం సేపటి తర్వాత శనగపిండి తీసుకుని కొంచెం నీరువేసి పేస్ట్ లా చేసుకుని నూనె రాసిన ముక్కు మీద శనగపిండి అప్లై చేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత ముక్కుని రుద్దుతూ మర్దన చేయాలి. కొద్ది సేపటి తర్వాత కడిగితే మీకు వెంటనే ఫలితం కనిపిస్తుంది. ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తొలగి.. నున్నగా ముక్కు కనిపిస్తుంది.

Also Read: మనజాతీయ గీతాన్ని సంతూర్‌పై వీనులవిందుగా ఆలపించిన ఇరానీ అమ్మాయి.. వీడియో వైరల్