Ayurveda Tips-Obesity: ఊబకాయంతో ఇబ్బందులు పడుతున్నారా.. పాటించాల్సిన ఆహార నియమాలు, యోగా

Ayurveda Tips-Obesity: ఊబకాయంతో ఇబ్బందులు పడుతున్నారా.. పాటించాల్సిన ఆహార నియమాలు, యోగా
Obesity

Obesity: రోజు రోజుకీ మనిషి ఆహారపు అలవాట్లు, జీవన శైలి మారిపోతున్నాయి. దీంతో నేటి జనరేషన్ ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య ఒబెసిటీ. తగ్గిన శారీరక శ్రమ. ఆహారంలోని మార్పులు..

Surya Kala

|

Aug 17, 2021 | 7:38 AM

Obesity: రోజు రోజుకీ మనిషి ఆహారపు అలవాట్లు, జీవన శైలి మారిపోతున్నాయి. దీంతో నేటి జనరేషన్ ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య ఒబెసిటీ. తగ్గిన శారీరక శ్రమ. ఆహారంలోని మార్పులు ఒబెసిటీకి కారణాలని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం ప్రజలకు అందుబాటులోకి రావడం.. మరోవైపు ప్రజలు తగినంతగా వ్యాయామం చేయకపోవడం కూడా ఊబకాయం పెరగడానికి కారణాలని చెప్పవచ్చు. అయితే ఈ ఒబెసిటీని తగ్గించుకుని శరీరంలోని కొవ్వు తగ్గి.. సన్నగా నాజూకుగా అయ్యేలా చేయడానికి సింపుల్ యోగాని కూడా ఫాలో అవుతూ.. ఆయుర్వేదంలో మంచి చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలు కలుగుతాయి.

ఒబేసిటీని తగ్గించుటకు సులభ యోగాలు:

* శారీరక శ్రమ అధికంగా చేయుట * అధిక దూరం నడవడం, పగటి నిద్రను తగ్గించుకోవడం.. * యావలు, చామలు వంటి సిరిధాన్యాలు ఆహారంగా తీసుకోవలెను * నీరు ఎక్కువుగా ఉన్న అన్నం భుజించాలి * ఉదయాన్నే తేనెతో గోరువెచ్చని నీటిని తాగవలెను. * ఉదయాన్నే వేడి అన్నంగాని గంజి గాని తాగవలెను. * చవ్యము, జీలకర్ర, శొంటి, మిరియాలు, పిప్పిళ్లు , ఇంగువ, సౌవర్చ లవణం, చిత్రమూలం వీటిని సత్తుపిండి, నీరు, మజ్జిగ యందు కలిపి తీసికొనవలెను. *వాయువిడంగములు, శొంఠి, యవాక్షారం, ఎర్రచిత్రమూలం, యావలు, ఉసిరిక రసం వీటి చూర్ణాలను మజ్జిగతో కలిపి సేవించినను శరీరం నందు కొవ్వు కరుగును. *త్రికటు చూర్ణం అనగా శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన భాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణమును ఆహారం తీసుకున్న తరువాత ఒక పావు స్పూన్ మజ్జిగలో కలిపి ఉదయం, రాత్రి సమయాల్లో తీసికొనవలెను. * మారేడు లేత ఆకులను తీసుకుని నూరి ఉదయం, సాయంకాల సమయాలలో శరీరానికి బాగా పట్టించి ముఖ్యంగా చంకలు , గజ్జలు వంటి బాగాలలో పట్టించి గంట సమయం తరువాత స్నానం చేయుచున్న శరీరంలోని కొవ్వు పేరుకొని పోవడం వలన శరీరం నుంచి వచ్చు దుర్గంధం హరించును . * గోమూత్రం ప్రతినిత్యం 10మీ. లీ నుంచి 15మీ.లీ లను ఒక కప్పు నీటిలో ఉదయం, సాయంత్రం తీసుకొన్నచో శరీరం సన్నబడును.

ఒబేసిటీ తగ్గించుకొనుటకు ఔషధాలు తీసుకుంటే మాత్రమే సరిపోదు.. మనం తినేరోజువారీ ఆహారంలో కూడా మార్పులు చేసుకోనవలెను.

పాటించవలసినవి:

పాతబియ్యం , వెదురు బియ్యం, చామలు , కొర్రలు , ఆళ్ళు , జొన్నలు , యావలు , ఉలవలు, పెసలు , కందులు, మాసూరపప్పు, తేనె , పేలాలు, ఎక్కువ కారం, చేదు గల పదార్దాలు, వగరు కలిగిన పదార్దాలు, మజ్జిగ, వేయించిన వంకాయ (నూనె తక్కువ) , ఆవనూనె ఆహరంలో ఉపయోగించాలి, పాయసం, ఆకుకూరలు , వేడినీరు తాగడం, ఎండ యందు తిరుగుట, ఏనుగు, గుర్రపు స్వారీ చేయుట, అధిక శ్రమ చేయుట, స్త్రీ సంగమం, నలుగు పెట్టుకొనుట, శనగలు, చిరు శనగలు, త్రికటుకములు, వాము తినటం వంటి ఆహార నియమాలను పాటించాలి.

పాటించకూడనివి :

చన్నీటి స్నానం, శాలి బియ్యం, గొధుమలు, అతిగా సుఖపడటం, పాలు, మీగడ, పెరుగు, పన్నీరు, మినుములు, కడుపు నిండా భోజనం, చెమట పట్టని ప్రదేశాలలో పని, చేపలు, మాంస పదార్దాలు, ఎక్కువసేపు నిద్రించడం, సుగంధ పదార్దాలు అతిగా వాడటం, తియ్యటి పదార్దాలు అతిగా తినటం, చద్ది అన్నం, చెరుకు రసంతో చేయబడిన అన్నం వీటిని దూరంగా ఉంటె శరీరంలోని కొవ్వు త్వరగా తగ్గుతుంది.

పైన చెప్పబడిన నియమాలు పాటిస్తే ఖచ్చితంగా శరీరం నందు కొవ్వు తగ్గి శరీరం నాజూకుగా అందంగా తయారవుతుంది.

Also Read:  నేటి తల్లులకు పిల్లల పెంపకానికి ప్రామాణికం.. మహాభారతంలోని ఇద్దరు శక్తివంతమైన మహిళలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu