Walking After Dinner: రాత్రిపూట భోజనం చేశాక వాకింగ్ చేయడం మంచిదేనా..? ఏం జరుగుతుందో తెలుసుకోండి..
Walking After Dinner: చాలామంది ఉద్యోగం చేస్తూ చాలా బిజీగా ఉంటారు. వ్యాయామం చేయడానికి అసలు సమయం ఉండదు. దీంతో చాలామంది వివిధ
Walking After Dinner: చాలామంది ఉద్యోగం చేస్తూ చాలా బిజీగా ఉంటారు. వ్యాయామం చేయడానికి అసలు సమయం ఉండదు. దీంతో చాలామంది వివిధ రకాల అరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అందుకే మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో రాత్రి భోజనం తర్వాత మనం కొంత సమయం పాటు నడవవచ్చు. వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు అందరికి తెలుసు. కానీ డిన్నర్ తర్వాత నడవడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఒక్కసారి తెలుసుకుందాం.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది – రాత్రిపూట నడవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
జీవక్రియను పెంచుతుంది – మీరు జీవక్రియను పెంచాలనుకుంటే ఆహారం తిన్న తర్వాత నడకకు ఉపక్రమించాలి. ఇలా చేస్తే మీ శరీరంలోని బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడం సులభం చేస్తుంది. రాత్రి భోజనం తర్వాత నడవడం ద్వారా బరువు కూడా తగ్గవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది – రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇది మీ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది మీ అంతర్గత అవయవాలకు బాగా పనిచేస్తుంది. బలమైన రోగనిరోధక శక్తి మిమ్మల్ని ఫ్లూ, జలుబు, అనేక ఇతర వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది – ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. అయితే రాత్రి భోజనం తర్వాత నడకకు వెళితే అది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. తద్వారా హైపర్గ్లైసీమియా ప్రమాదాన్ని తొలగిస్తుంది.
డిప్రెషన్‌లో సహాయపడుతుంది – మీ శరీరంలో ఎండార్ఫిన్‌లను విడుదల చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి మీరు ఒత్తిడికి గురైతే నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి పని చేస్తుంది. మిమ్మల్ని సంతోషపరుస్తుంది.