AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White or Brown Eggs: నాటు కోడి గుడ్లకు, ఫారం కోడి గుడ్లకు తేడాలేంటి..! ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..

White or Brown Eggs: ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. అనుకోకుండా

White or Brown Eggs: నాటు కోడి గుడ్లకు, ఫారం కోడి గుడ్లకు తేడాలేంటి..! ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..
White Or Brown Eggs
uppula Raju
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 17, 2021 | 6:19 AM

Share

White or Brown Eggs: ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. అనుకోకుండా ఇంటికి అతిథులు వస్తే ఓ రెండు ఉల్లిగడ్డలు, గుడ్డు కలిపితే అద్భుతమైన విందుభోజనం చిటికలో వడ్డించొచ్చు. సంపూర్ణ ఆహారంలో గుడ్డు కూడా ఓ భాగమే మరి. అందుకే గుడ్డు వెరీ గుడ్డు అనేది. అయితే ఇప్పటికి చాలా మంది నమ్మేది నాటుకోడి గుడ్డులో చాలా పోషకాలు ఉన్నాయి అని నమ్ముతారు. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే.

ఫారం కోడిగుడ్ల కంటే నాటు కోడి గుడ్లలో చాలా బలం ఉంటుందని చాలామందిలో ఓ దురభిప్రాయం ఉంటుంది. అది కేవలం అపోహ మాత్రమే. అందుకే తెల్లగా ఉండే ఫారం కోడిగుడ్ల కంటే కాస్తంత గోధుమ రంగులో లేదా ముదురు రంగులో ఉండే నాటు కోడి గుడ్లను మరింత ఎక్కువ ధర పెట్టి కొంటుంటారు. అయితే  బ్రౌన్, వైట్ రెండింటిలోనూ సమానమైన పోషకాలుంటాయని చెబుతున్నారు. తెలుపు రంగు గుడ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో, బ్రౌన్ గుడ్లలో కూడా అవే పోషకాలు ఉంటాయి. రెండింట్లో పెద్దగా తేడా ఉండదు. రంగు మాత్రమే తేడా అంతే అంటున్నారు పరిశోధకులు. రుచిలో కూడా కొంచెం తేడా ఉంటుంది తప్ప పోషకాల విలువలలో మాత్రం తేడా లేదని పరిశోధకులు తేల్చి చెప్పారు.

ఇక వేసవిలో దొరికే గుడ్లు కాస్త చిన్నవిగా ఉంటాయి. గుడ్డు యొక్క స్థితిని తెలుసుకోవాలంటే దాన్ని నీళ్లలో వేయాలి. ఒక గిన్నెలో నిండుగా నీళ్లు తీసుకొని దాన్లో గుడ్డును వేసినప్పుడు అది నీటి అడుగుకు చేరితే తాజా గుడ్డుగా, నీళ్లల్లో తేలితే పాతదిగా గుర్తించవచ్చు. ఒకవేళ పాతది అని తెలిస్తే పారవేయాలి.. పూర్తిగా నీటిలో మునిగితేనే కోడిగుడ్డు మంచిది. గుడ్డుని తినడం వలన కండరాలు దృఢంగా అవుతాయి. ఇది క్రీడాకారులుకు మంచి ఆహారం. గుడ్డులో ఉన్న రైబోఫ్లేవిన్ చర్మం ఆరోగ్యానికి, సరిగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది.

Sports Photos: చీరలో ‘సింధు’ మెరిసే..! సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు

Two Headed Cobra: వామ్మో రెండు తలల నాగుపాము..! చూస్తే ఆశ్చర్యపోతారు..

Viral Video : భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..