Kunti And Gandhari: నేటి తల్లులకు పిల్లల పెంపకానికి ప్రామాణికం.. మహాభారతంలోని ఇద్దరు శక్తివంతమైన మహిళలు

Kunti And Gandhari: నేటి తల్లులకు పిల్లల పెంపకానికి ప్రామాణికం.. మహాభారతంలోని ఇద్దరు శక్తివంతమైన మహిళలు
Kunti Gandhari

 Moral Story Mahabharata: మహాభారతంలో కుంతి ,గాంధారి, ఇతిహాసంలోని సంఘటనల మలుపును ప్రభావితం చేసిన ఇద్దరు శక్తివంతమైన మహిళలు. అందుకనే మహాభారతంలో..

Surya Kala

|

Aug 17, 2021 | 6:29 AM

Moral Story Mahabharata: మహాభారతంలో కుంతి ,గాంధారి, ఇతిహాసంలోని సంఘటనల మలుపును ప్రభావితం చేసిన ఇద్దరు శక్తివంతమైన మహిళలు. అందుకనే మహాభారతంలో కుంతీ, గాంధారీ పాత్రలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వందమంది సంతానం ఉన్న గాంధీ.. ఐదుగురు సంతానాన్ని పెంచిన కుంతీ.. ఇద్దరూ నేటి తల్లులకు పిల్లల పెంపకానికి ప్రామాణికం.. దృతరాష్ట్రుడి భార్య గాంధారికి బహుసంతానవతి అని వరముంది. ఆమెకు సంతానాపేక్ష ఎక్కువే అయినా భర్త, సంతానం అంతా ధర్మం తప్పి ప్రవర్తించినా తాను మాత్రం ధర్మం విషయంలో ఎక్కడా రాజీపడకుండా నిలిచి మాట్లాడిన వ్యక్తిత్వం గాంధారీ సొంతం. ఒకసారి దుర్యోధనుడు వచ్చి తల్లి కాళ్లకు నమస్కరించి ‘నాకు విజయం కలగాలి’ అని ఆశీర్వదించామన్నాడు. దీంతో అప్పుడు గాంధారీ నిర్మొహమాటంగా… “ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం. నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు పాదాలను ఆశ్రయించు. ఆయనకు వశవర్తియై ప్రవర్తించు. అప్పుడు ధర్మాన్ని నీవు పొందుతావు. దాని కారణంగా విజయాన్ని కూడా పొందుతావు తప్ప నీవు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు సుయోధనా…అంటూ కొడుకుని ముందుగా హెచ్చరించింది.

కురుక్షేత్ర యుద్ధభూమిలోకి గాంధారీ వెళ్ళి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉన్నారు. ముఖ్యంగా దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలయి పడిపోతే….ఆమె కోపం అటుతిరిగి ఇటు తిరిగి ఎవరిమీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసి అంది…అన్నీ నీకు తెలుసు కృష్ణా, వీరందరూ మరణిస్తారని తెలుసు. నువ్వే పూనుకుని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు. దీనికంతటికీ కారణం కృష్ణా నువ్వే… నీ యదువంశంలో కూడా ఇలా ఒకరితో ఒకరు కొట్టుకుని నశించి పోయెదరు గాక… కొన్ని సంవత్సరాల తరువాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చెదవుగాక.. అని శపించింది. గాంధారీ శాపం విన్న కృష్ణుడు నవ్వి “అమ్మా.. ధర్మం వైపు నిలబడిన నాకు నువ్విచ్చే కానుకా ఇది..అని అన్నాడు. ఆ మాటతో ఇంతటి మహోన్నతమైన గాంధారి కూడా కుంచించుకు పోయింది. ఎంత చెప్పినా వినకుండా అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మరణించిన నూరుగురు కొడుకులను చూసుకుని ఆఖరున వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక్కడు కూడా బతకలేదు కదా… ‘ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది మరణించారు అంటూ వ్యాకులత చెంది కుంతిబిడ్డల పంచనజేరి జీవితం గడుపుతూ.. భీముడనే మాటలు వినలేక ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయింది. అక్కడ దావాగ్నిలో తన శరీరాన్ని విడిచి పెట్టింది గాంధారీ.

పాండవుల తల్లి కుంతీదేవి. నిజానికి ఆమె కుంతిభోజుని కుమార్తె కాదు, శూరసేనుడి కుమార్తె. అందుకే కుంతీ శ్రీ కృష్ణుడికి మేనత్త, వసుదేవునికి చెల్లెలు. అసలు తండ్రి పెట్టిన పేరు పృథ. కుంతిభోజుడు పెంచుకున్నాడు. కనుక కుంతీదేవి అయింది. అయితే భారతం లోని కుంతీ ఎదుర్కొన్న ఉత్థాన పతనాలు.. ఆమె సహనం, గొప్ప లక్షణాలు… అన్నీ ఆశ్చర్యంకలిగించేవే.. అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యులు ఎవరి క్షేమసమాచారం గురించి తెలుసుకోవాలనుకున్నారో తెలుసా? కుంతీదేవిని గురించి. అంతటి భీష్ముడు కుంతీదేవి గురించి ఒకమాటన్నారు “అసలు ఆ కుంతీదేవిలాంటి స్త్రీ లోకంలో ఉంటుందా? ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచిందో, మహా ఔన్నత్యం కల తల్లి అన్నారు. అది మహాభారతంలోని గాంధారీ, కుంతిల వ్యక్తిత్వం..

Also Read: హిందూ సంప్రదాయంలో ఈ ఐదు జంటల్లా నేటి భార్యభర్తలుంటారట.. ఈ జంటల్లో మీరున్నారా తెలుసుకోండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu