AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఇతరులను సంతోష పెట్టడానికి వాగ్దానాలు చేయకండి.. కావాల్సినంత ధనం చేతికి అందుతుంది..

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే

Horoscope Today: ఇతరులను సంతోష పెట్టడానికి వాగ్దానాలు చేయకండి.. కావాల్సినంత ధనం చేతికి అందుతుంది..
Horoscope Today
Follow us
uppula Raju

|

Updated on: Aug 17, 2021 | 5:23 AM

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. మంగళవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఓ సారి చూద్దాం..

మేష రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే మరింత కష్టపడాలి. నూతన స్నేహితులు పరిచయం అవుతారు. ఇంటికి కొత్తగా పాప, బాబు రాబోతున్నారు ఆనందించండి. ఇంట్లో శుభకార్యాలు. ఇతరులను సంతోష పెట్టడానికి లేనిపోని వాగ్దానాలు చేయకండి. కావాల్సినంత ధనం చేతికి అందడం వలన మనశ్శాంతి.

వృషభ రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే ధైర్యం పట్టుదల అవసరం. వ్యాపారస్తులు లాభాల కోసం కొంత కాలం వేచి ఉండండి. గందరగోళం వదిలేయండి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయడానికి మరింత శ్రమ పడాలి. మీ సామర్థ్యాన్ని ఉపయోగించండి. అప్పులు చేయడం ఎంత తప్పో ఈ రోజు అప్పు తీరుస్తున్నప్పుడు తెలుసుకుంటారు.

మిధున రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొంతమందికి ప్రమోషన్. వ్యాపారులకు లాభాలు. మానవసేవే మాధవసేవ. అవసరం ఉన్న వాళ్లకి సహాయం చేయండి దాని వల్ల దైవ బలం. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి.

కర్కాటక రాశి : ఆత్మవిశ్వాసంతో సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసులో అదనపు బాధ్యతలు వల్ల పనులలో అధిక శ్రమ. మీ సామర్ధ్యాన్ని ఉపయోగించి పనులను పూర్తి చేయండి. వ్యాపారులకు లాభాలు. కావలసినంత ధనం చేతికందుతుంది కొంతభాగాన్ని దానధర్మాలు చేస్తారు. విద్యార్థులు మీ సమయాన్ని వృధా చేసే స్నేహితులను వదిలివేయండి.

సింహ రాశి : ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. దైవప్రార్థన వలన మానసిక బలం. ఆఫీసు పనులను మీ సామర్థ్యాన్ని ఉపయోగించి సకాలంలో పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగుల సహాయం లభిస్తుంది. వ్యాపారులకు మొదట్లో ఇబ్బందులు ఉన్నా తర్వాత లాభాలు అందుకుంటారు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి.

కన్య రాశి : సహనము, పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. కుటుంబ సభ్యులలో సామరస్య ధోరణి వల్ల ఆహ్లాదకర వాతావరణం. శుభవార్త అందుకుంటారు. విదేశీ వ్యాపారం చేసే వారికి లాభాలు. ఆఫీసులో అదనపు బాధ్యతల వలన పనులలో అధిక శ్రమ. మీ సామర్ధ్యాన్ని ఉపయోగించి పనులను పూర్తి చేయండి.

తులారాశి : ఇంట్లో శుభకార్యాలు. ఆత్మవిశ్వాసము దైవ బలంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. మీ పిల్లల చదువులను గమనించండి లేకుంటే భవిష్యత్తులో బాధపడతారు. ఆఫీసులో మీ పని నిబద్ధత పట్ల అందరి ప్రశంసలు. కొత్తగా వ్యాపారం చేద్దామనుకుంటున్న వారు అనుభవజ్ఞుల సలహా తో ఆ పని చేయండి. కావాల్సినంత ధనం చేతికందుతుంది.

వృశ్చిక రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే జాగ్రత్త, సహనం అవసరం. ఫిట్ నెస్ కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతల వల్ల అధిక శ్రమ. మీ పని నిబద్ధత పట్ల అందరి ప్రశంసలు. కొందరికి ప్రమోషన్. మీ కుటుంబ ఆదాయ వ్యవహారాల లోనికి ఇతరులను రానీయకండి. వివాదాస్పద విషయాల జోలికి వెళ్లి వాదోపవాదాలకు దిగకండి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి.

ధనస్సు రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సహనము సరైన ప్రణాళిక తప్పనిసరి. జనాలు మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారు అది ఏంటో తెలుసుకోకుండా మాట ఇవ్వకండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. పాత అప్పులు తీర్చి వేయవలసి వస్తుంది. అప్పులు చేయడం ఎంత తప్పు ఈరోజు అప్పు తీరుస్తున్నప్పుడు తెలుసుకుంటారు. ఆఫీసు పనులలో అధిక శ్రమ.

మకర రాశి : ఆత్మ విశ్వాసం ఆత్మ స్థైర్యం సహనం ఇవన్నీ కావాలి మీరు అనుకున్న కార్యాలను సాధించాలంటే. దీర్ఘకాలంగా బాధిస్తున్న రోగం తగ్గుతుంది. ఆడంబరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు గమనించండి. మీ మీద ఆజమాయిషి చలాఇద్దామనుకునే వారిని దూరం పెట్టండి. మంచివారు అనిపించుకోవాలనే మీ తాపత్రయం చాలా తప్పు. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహాయం లభిస్తుంది.

కుంభరాశి : పట్టుదల ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. స్నేహితుల సహాయం లభిస్తుంది. ఆర్థిక సమస్యలను గురించి అతిగా ఆలోచించడం మానండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి, మీ పై అధికారులు మిమ్మల్ని గమనిస్తున్నారు. వ్యాపారులు మీ భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆఫీసులో పనులను అధిక సామర్థ్యం తో సకాలంలో పూర్తి చేస్తారు.

మీన రాశి : ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల గురించి కుటుంబ సభ్యులతో చర్చించండి వారితో మనసు విప్పి మాట్లాడండి. అపార్ధాలు తొలగిపోతాయి అందరూ ఆనందిస్తారు. అనాలోచిత నిర్ణయాల వలన భవిష్యత్తులో ఇబ్బందులు. ఆఫీసులో పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు. కావలసినంత ధనం చేతికందుతుంది. అదృష్టం మీ పక్షాన ఉంది.