Talibans: కాబూల్ శివార్లలో ప్రవేశించిన తాలిబన్లు. నగర స్వాధీనానికి బల ప్రయోగం చేయబోమని ప్రకటన
తాలిబాన్లు కాబూల్ శివార్లలో ప్రవేశించారు. కానీ బల ప్రయోగంతో ఆ నగరాన్ని స్వాధీనం చేసుకోబోమని ప్రకటించారు. కలగాన్, కరాబాగ్. పాగ్మాన్ జిల్లాల్లో తాము ఉన్నామని చెప్పిన వీరు కాబూల్ లోని ప్రజల ప్రాణాలకు, వారి ఆస్తులకు ఎలాంటి ముప్పు ఉండదని అన్నారు.
తాలిబాన్లు కాబూల్ శివార్లలో ప్రవేశించారు. కానీ బల ప్రయోగంతో ఆ నగరాన్ని స్వాధీనం చేసుకోబోమని ప్రకటించారు. కలగాన్, కరాబాగ్. పాగ్మాన్ జిల్లాల్లో తాము ఉన్నామని చెప్పిన వీరు కాబూల్ లోని ప్రజల ప్రాణాలకు, వారి ఆస్తులకు ఎలాంటి ముప్పు ఉండదని అన్నారు. వీరు ఈ ప్రకటన చేసినప్పటికీ కాబూల్ లోని పలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు భయంతో పారిపోయారు. దేశంలో తాలిబన్లు పట్టు బిగించడంతో ఈ నగరంలోని తమ రాయబార కార్యాలయం నుంచి అమెరికా తన ఉద్యోగులను తరలించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అమెరికా హెలికాఫ్టర్లు ఇక్కడ అదే పనిగా చక్కర్లు కొడుతున్నాయి. అధ్యక్షుడు అష్రాఫ్ ఘని సలహాదారుల్లో చాలామంది ఇదివరకే తాలిబాన్లకు లొంగిపోగా మరి కొందరు పారిపోయారు. చెక్ రిపబ్లిక్ కూడా తమ దౌత్య కార్యాలయం నుంచి తమ సిబ్బందిని తరలించే సన్నాహాలు చేస్తోంది. కాగా కాబూల్ లోని పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో చేరుతున్న ప్రజలు తమ భవితవ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతోంది. ప్రైవేటు బ్యాంకుల నుంచి తమ సొమ్ము తీసుకునేందుకు చాలామంది అక్కడ గుమికూడుతున్నారు.
అయితే నగరంలో అక్కడక్కడా కాల్పుల శబ్దం వినబడుతోంది. బహుశా ఆఫ్ఘన్ దళాలకు, తాలిబాన్లకు మధ్య పోరు జరుగుతున్నట్టు భావిస్తున్నారు.ఇంత జరుగుతున్నా అధ్యక్షుడు మాత్రం తన భవిష్యత్ వ్యూహం గురించి ప్రకటించలేదు. ఒకవేళ తాలిబన్లు ఈ నగరాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుంటే ఆయన వారికీ లొంగిపోతాడా లేదా అన్నది తేలాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి : బాయ్‌ఫ్రెండ్ కోసం..జుట్లు పీక్కుని కొట్టుకున్న అమ్మాయిలు..!ట్రెండ్ అవుతున్న వీడియో: Girls Hit For a Boyfriend Video.
జోకర్ దొంగ..పోలీసులకే ఛాలెంజ్..!హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీ వైరల్ వీడియో..:Joker Thief Video.