ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని రాజీనామా చేస్తారా ? మాజీ ఆఫ్ఘన్ హోం మంత్రికి అధికారం అప్పగింత ..?
ఆఫ్గనిస్తాన్ లో అధ్యక్షుడు అష్రాఫ్ ఘని పదవి నుంచి వైదొలిగేందుకు రంగం సిధ్దమైనట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్ మాజీ హోం మంత్రి అలీ అహ్మద్ జలానీకి అధికారం అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబూల్ లో పుట్టిన జలాల్ 1987 లో అమెరికా పౌరసత్వం తీసుకుని
ఆఫ్గనిస్తాన్ లో అధ్యక్షుడు అష్రాఫ్ ఘని పదవి నుంచి వైదొలిగేందుకు రంగం సిధ్దమైనట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్ మాజీ హోం మంత్రి అలీ అహ్మద్ జలానీకి అధికారం అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబూల్ లో పుట్టిన జలాల్ 1987 లో అమెరికా పౌరసత్వం తీసుకుని అప్పటి నుంచి అక్కడి మేరీలాండ్ లో నివాసం ఉంటున్నారు. తాలిబాన్లకు అధికార పంపిణీపై అధ్యక్ష భవనంలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాబూల్ గేట్ల వద్దే ఉండాలని, సిటీలోకి ఎంటర్ కారాదని ఇస్లామిక్ ఎమిరేట్స్ తమ తాలిబన్లను ఆదేశించింది. తాలిబన్ ప్రభుత్వానికి శాంతియుతంగా అధికార బదలాయింపు జరుగుతుందని ఆఫ్ఘన్ హోం మంత్రి అబ్దుల్ సత్తార్ మీర్జాక్ వాయ్ అంతకుముందు..రికార్డు చేసిన స్పీచ్ లో తెలిపారు. ఆఫ్ఘన్ ప్రజలు ఆందోళన చెందవద్దని.. కాబూల్ నగరంపై దాడి జరగదని ఆయన చెప్పారు. ఏమైనా ఇంతత్వరగా ఆఫ్ఘన్ ప్రభుత్వం కుప్ప కూలిపోతుందని తాము ఊహించలేదని పలువురు దౌత్యాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు., నిజానికి కాబూల్ నగరాన్ని వశపరచుకోవడానికి తాలిబాన్లకు సుమారు మూడు నెలలు పట్టవచ్చునని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి.
ఇలా ఉండగా కాబూల్ విమానాశ్రయం నుంచి భారతీయులతో కూడిన ఓ విమానం ఈ రాత్రి ఢిల్లీ చేరనున్నట్టు తెలిసింది. ఆ నగరంలో మిగిలి ఉన్న ఇండియన్స్ అందరినీ ఈ విమానంలో స్వదేశానికి తీసుకురానున్నారు. ఇప్పటికే కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం నుంచి అనేకమంది సిబ్బందిని ఢిల్లీకి తరలించారు. అటు-ఆఫ్ఘన్ తాజా పరిణామాలను అమెరికా, రష్యా, బ్రిటన్ తదితర దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఆఫ్ఘన్ లోని తమ దేశియులను అమెరికా యుద్ధ ప్రాతిపదికన స్వదేశానికి తరలిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : పాగల్ ప్రేమికుడు విశ్వక్ సేన్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ :Vishwak Sen Exclusive Interview Video.