Silver Price Today: వెండి ధరలకు బ్రేకులు.. దేశీయంగా స్థిరంగా కొనసాగుతున్న సిల్వర్ ధరలు.!
Silver Price Today: భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇటీవల నుంచి తగ్గుతూ పెరుగుతున్న సిల్వర్.. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా..
Silver Price Today: భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇటీవల నుంచి తగ్గుతూ పెరుగుతున్న సిల్వర్.. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే దేశీయంగా కిలో వెండికి రూ.70 వేల వరకు ఉన్న వెండి.. రోజురోజుకు దిగివస్తోంది. సోమవారం (ఆగస్టు 16) ఉదయం 6 గంటల సమయానికి దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.63,200 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.68,200 ఉండగా, కోల్‌కతాలో రూ.63,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.63,200 ఉండగా, కేరళలో రూ.68,200 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.63,200 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,200 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.68,200 ఉండగా, విశాఖపట్నంలో రూ.68,200 ఉంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిది.
ఇవీ కూడా చదవండి: Gold Price Today: బంగారం ధర జిగేల్.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తాజా రేట్లు ఇలా ఉన్నాయి..!