Petrol-Diesel Rates Today: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. అక్కడ మాత్రం స్వల్ప మార్పులు.!

Petrol-Diesel Rates Today: గత కొన్ని రోజులుగా దేశీయంగా పెట్రోల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా రేట్లు పెరగకపోయినా.. ఇప్పటి వరకు పెరిగిన ధరలతో వాహనదారులకు..

Petrol-Diesel Rates Today: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. అక్కడ మాత్రం స్వల్ప మార్పులు.!
Fuel price
Follow us

|

Updated on: Aug 16, 2021 | 7:03 AM

Petrol-Diesel Rates Today: గత కొన్ని రోజులుగా దేశీయంగా పెట్రోల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా రేట్లు పెరగకపోయినా.. ఇప్పటి వరకు పెరిగిన ధరలతో వాహనదారులకు భారంగా మారింది. లీటర్‌ పెట్రోల్‌ ధర సెంచరీదాటిపోవడంతో వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు జనాలు. ఇక వరుసగా 30 వ రోజు కూడా పెట్రోల్‌ డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే దేశీయంగా ధరలు ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా, డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా, డీజిల్ ధర రూ.94.39గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 ఉండగా, డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.90.15గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.10గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.97.53గా ఉంది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.03 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.62గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.04 ఉండగా,. డీజిల్ ధర రూ. 98.65గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.16లకు లభిస్తుండగా, డీజిల్ ధర రూ.98.76గా ఉంది.

Debit Card EMI: ఈ బ్యాంకు డెబిట్‌ కార్డుతో ఈఎంఐ ఆప్షన్‌.. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలన్నీ పొందవచ్చు..!

Health Insurance: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందే!