SBI Special Deposit Scheme: ఎస్‌బీఐ ప్రత్యేక డిపాజిట్ల పథకం ప్రారంభం.. వడ్డీ రేట్ల వివరాలు ఇలా..!

SBI Special Deposit Scheme: స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక డిపాజిట్‌ పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక..

SBI Special Deposit Scheme: ఎస్‌బీఐ ప్రత్యేక డిపాజిట్ల పథకం ప్రారంభం.. వడ్డీ రేట్ల వివరాలు ఇలా..!
Sbi
Follow us
Subhash Goud

|

Updated on: Aug 16, 2021 | 11:23 AM

SBI Special Deposit Scheme: స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక డిపాజిట్‌ పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక డిపాజిట్‌ పథకం, ఎస్‌బీఐ ప్లాటినం డిపాజిట్లు పరిమిత కాల ఆఫర్‌ సెప్టెంబర్‌ 14తో ముగుస్తుంది. అయితే ఎస్‌బీఐ టర్మ్‌ డిపాజిట్లు, ప్రత్యేక టర్మ్‌ డిపాజిట్లతో ప్రత్యేక ప్రయోజనాలున్నాయి. ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది ఎస్‌బీఐ. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 14, 2021 వరకు అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. ఎస్‌బీఐ ప్లాటినం డిపాజిట్ల కాలం 75 రోజులు, 525 రోజులు, 2250 రోజులు ఉంది.

ఎస్‌బీఐ ప్లాటినం డిపాజిట్ల పై వడ్డీ రేట్లు:

► ఎస్బీఐ  75 రోజుల వ్యవధిలో సాధారణ ప్రజలకు  ప్రస్తుతం 3.90 శాతం ఉండగా, అదే సమయంలో, ప్రత్యేక డిపాజిట్ పథకం కింద ప్లాటినం 75 రోజుల వ్యవధిపై 3.95 శాతం వడ్డీని చెల్లించాలని ప్రతిపాదించబడింది.

► అదే సమయంలో, ప్లాటినంపై 5.10 శాతం వడ్డీని 525 రోజులు, అలాగే ప్లాటినం 2250 రోజులకు 5.55 శాతం చెల్లించాలని ప్రతిపాదించింది.

► ప్రస్తుతం, బ్యాంక్ 525 రోజులు, 2250 రోజుల వ్యవధిలో సాధారణ ప్రజలకు 5 శాతం ఉండగా, 5.40 శాతం వడ్డీని ఇస్తోంది. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నెలవారీ / త్రైమాసిక వ్యవధిలో చెల్లించబడుతుంది, అయితే ప్రత్యేక టర్మ్ డిపాజిట్లపై మెచ్యూరిటీపై వడ్డీ రేటు చెల్లించబడుతుంది.

ప్రత్యేక డిపాజిట్ల పథకం ఫీచర్లు

► SBI ప్లాటినం డిపాజిట్ల కింద, కస్టమర్ 75 రోజులు, 525 రోజులు మరియు 2250 రోజులకు స్థిరమైన డబ్బును పొందవచ్చు.

► NRE, NRO టర్మ్ డిపాజిట్‌లతో సహా (రూ.2 కోట్ల కన్నా తక్కువ) దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లపై ఈ పథకాన్ని పొందవచ్చు.

► కొత్త, పునరుద్ధరణ డిపాజిట్లు కూడా చేయవచ్చు. కేవలం టర్మ్ డిపాజిట్ మరియు ప్రత్యేక టర్మ్ డిపాజిట్ ఉత్పత్తులు.

 సీనియర్‌ సిటిజన్లకు:

► ప్లాటినం 75 రోజులు: ప్రస్తుతం 4.40 శాతం ఉండగా, ఇప్పుడు 4.45శాతానికి పెరిగింది.

► ప్లాటినం 525 రోజులు: ప్రస్తుతం 5.50 శాతం ఉండగా, తాజాగా 5.60 శాతానికి పెంచారు.

► ప్లాటినం 2250 రోజులు: ప్రస్తుతం 6.20 శాతం (SBI WECARE పథకం కింద వర్తించే వడ్డీ రేటు) సీనియర్‌ సిటిజన్లు, ఎస్‌బీఐ పెన్షనర్లు SBI WECARE స్కీమ్‌ కింద ఐదు సంవత్సారాల వరకు ఈ ప్రయోజనాలు పొందుతారు.

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు:

సాధారణ వినియోగదారులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 2.9 శాతం నుంచి 5.4 శాతం వరకు ఉన్నాయి. ఈ డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లు అదనంగా 50 బేసిక్‌ పాయింట్లు పొందుతారు.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వినియోగదారులకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. సాధారణ వినియోగదారులకు, సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందిస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర డిపాజిట్లపై ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను సవరిస్తూ వస్తోంది. అలాగే ప్రవేశపెట్టిన వివిధ స్కీమ్‌ల కాలపరిమితిని పొడిగిస్తూ వస్తోంది. ఎస్‌బీఐ సీనియర్‌ సిటిజన్లకు ఎన్నో ఆఫర్లు అందుబాటులోకి తీసుకువస్తోంది. అలాగే గృహ రుణాలపై వడ్డీరేట్లు, బంగారు రుణాలపై వడ్డీరేట్లను కూడా సవరిస్తూ వస్తోంది.

కాగా, భారతదేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రారంభించిన ఎస్బీఐ..  ఈ కొత్త ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పథకం కింద ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి పెట్టుబడి పెట్టె నగదుపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల కన్న అధిక వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్ గా పిలువబడే ఈ కొత్త స్కీమ్ వల్ల వారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అదనంగా బేసిస్ వడ్డీ పాయింట్లు లభిస్తాయి. ప్రస్తుతం, ఎస్‌బీఐ అన్ని కాలవ్యవధుల టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లను అందిస్తోంది. వీకేర్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో వారు ఇప్పుడు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టె టర్మ్ డిపాజిట్లపై ఈ అదనపు బేసిస్ పాయింట్లు, అదనపు వడ్డీని పొందవచ్చు.

ఇవీ కూడా చదవండి: Debit Card EMI: ఈ బ్యాంకు డెబిట్‌ కార్డుతో ఈఎంఐ ఆప్షన్‌.. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలన్నీ పొందవచ్చు..!

Health Insurance: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందే!