Washing Machine: తక్కువ ఖర్చుతో వాషింగ్ మెషిన్‌ను తయారు చేసిన ఇంజనీర్.. త్వరలో భారత్‌లోకి ఎంట్రీ
Washing Machine: ప్రస్తుత జనరేషన్ లో సమయం చాలా విలువైంది. దీంతో పనులు సులభంగా చేసుకోవడం కోసం ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో బట్టలు..
Washing Machine: ప్రస్తుత జనరేషన్ లో సమయం చాలా విలువైంది. దీంతో పనులు సులభంగా చేసుకోవడం కోసం ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో బట్టలు ఉతకడం అంటే పెద్ద పనిగా మారిపోయింది. దీంతో వాషింగ్ మెషీన్స్ పై ఆధారపడడం సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా వాషింగ్ మెషీన్స్ వచ్చిన తర్వాత మహిళలకు చాలావరకూ పని చేసే సమయం కలిసి వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వాషింగ్ మెషీన్స్ ధరలు సామాన్యులకు, మధ్యతరగతివారికి అందుబాటులో లేవు. దీంతో వాషింగ్ మెషీన్స్ కొనుగోలు చేయాలంటే కొంచెం సామాన్య, మధ్యతరగతి పిల్లలకు అందని ద్రాక్షగా మారింది. అటువంటి అల్పాదాయవర్గాల వారి కోసం తక్కువ ధర ఉన్న వాషింగ్ మెషీన్స్ ను తయారు చేశాడు ఓ ప్రవాసాంధ్రుడు. ఈ వాషింగ్ మెషీన్స్ త్వరలో భారత్ కు రానున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ఓ వాషింగ్ మెషిన్ తయారు చేయాలని భారత్ మూలాలున్న నవజ్యోత్ సాహ్నీ అనే విద్యార్థి మూడేళ్ళ క్రితం ఆలోచించాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాడు. తన ఆలోచనకు తోడుగా స్వచ్చంద సేవకులు, భాగస్వాములు నిలిచాడు. దీంతో నవజ్యోత్ సాహ్నీ వీరి సాయంతో ఇరాన్ లోని రెఫ్యూజీ క్యాంపులో ఏర్పాటు చేయనున్నారు.
తనకు తక్కువ ధరకు వాషింగ్ మెషిన్ తయారు చేయాలనీ ఆలోచన రావడానికి కారణం తన స్నేహితురాలు అని చెబుతన్నారు నవజ్యోత్ సాహ్నీ . ఇదే విషయం పై నవజ్యోత్ మాట్లాడుతూ.. ఓ సారి తన స్నేహితురాలు దివ్యను కలిసేందుకు వారి ఇంటికి వెళ్లాలని. అక్కడ దివ్య పని చేస్తున్న తీరు తనని బాధపెట్టిందని.. బాగా మసిపట్టిన గ్యాస్ స్టవ్ తుడుస్తూ ఉండటం చూసి చలించిపోయినట్లు తెలిపాడు. ఆ సమయంలో ఆమె బట్టలు కూడా ఉతికింది. అప్పుడు తనకు ఆడవారి కష్టాన్ని తీర్చేలా ఏదైనా చేయాలనీ భావించినట్లు చెప్పాడు. ఆలా ఆలోచనలోంచి పుట్టిందే.. తక్కువ ధరలో వాషింగ్ మెషిన్ తయారీ.. అనుకున్నదే తడవుగా పనులు మొదలు పెట్టి.. తక్కువ ఖర్చుతో వాషింగ్ మెషిన్ ను దిగ్విజయంగా పూర్తి చేశానని తెలిపాడు. ఇక దానికి తన స్నేహితురాలి పేరునే పెట్టాడు.. దివ్య 1.5 పేరుతో మొదటి వాషింగ్ మెషిన్ విడుదల చేశాడు. ఈ వాషింగ్ మెషిన్ ద్వారా 60-70 శాతం సమయాన్ని ఆదా చేయవచ్చు. అలాగే 50 శాతం నీటిని కూడా సేవ్ చేసేందుకు వీలుగా దీన్ని అభివృద్ధి చేశారు. దీని తయారీకి ఇంట్లోని వంటగదిలో సాధారణంగా ఉపయోగించే సలాడ్ స్పిన్నర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ప్రస్తుతం దివ్య 1.5ను స్వచ్ఛంద సంస్థ కేర్ ఇంటర్నేషనల్ సహాయంతో ఇరాక్‌లోని మమ్రాషన్ శరణార్థుల శిబిరంలో 30 వాషింగ్ మెషీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది 300 మంది లాండ్రీ అవసరాలు తీర్చవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్కో ఇంటికి 750 పనిగంటల వరకు ఆదా చేయవచ్చని భావిస్తున్నారు.
Also Read: ముక్కుపై బ్లాక్స్‌హెడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. ఈ వంటింటి చిట్కాలు అప్లై చేసి చూడండి