AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే మీ కథ కంచికే!

మనం సరదాగా తినే కొన్ని చిరుతింట్లు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని మీకు తెలుసా? అవును మనం తినే ఐస్‌క్రీం, తీసుకునే డైట్ సోడా, చూయింగ్‌ గమ్ వంటి కొన్ని చిరుతింట్లు మన కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట. ఇది మేం చెబుతున్న విషయం కాదు. వీటి తయారీ కోసం ఉపయోగించే సార్బిటాల్ అనే కృతిమ తీపి పదార్థం కాలేయాన్ని నాశనం చేస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.

Health Tips: ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే మీ కథ కంచికే!
Fatty Liver Disease
Anand T
|

Updated on: Dec 06, 2025 | 5:17 PM

Share

మన సరదాగా టైమ్ పాస్‌కు తినే ఐస్‌క్రీం, చూయింగ్ గమ్ వంటి కొన్ని చిరుతిండ్లు మన ఆరోగ్యానికే ఎసరు పెడుతున్నాయి. కొత్త అధ్యయనం ప్రకారం, వీటిలో ఉండే సోర్బిటాల్ అనే పదార్థం కాలేయానికి హానికరమైన కృత్రిమ స్వీటెనర్, కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని తెలుస్తోంది. యూరోపియన్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం , చక్కెర రహిత లేదా ఆహార ఉత్పత్తులలో లభించే స్వీటెనర్ సార్బిటాల్ చిన్న ప్రేగులలో సరిగ్గా విచ్ఛిన్నం చేయబడదు, కాబట్టి ఇది కాలేయంలో కొవ్వు గా పేరుకుపోతుంది.

వీటినిఎక్కువ కాలం తీసుకుంటే ఆల్కహాల్ లేని ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ప్రమాదాన్ని నేరుగా పెంచకపోవచ్చని నిపుణులు అంటున్నారు. రోజుకు దాదాపు ఒక డబ్బా డైట్ సోడా లేదా చక్కెర-తీపి పానీయాలు తాగడం వల్ల ఆల్కహాల్ లేని ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

సార్బిటాల్, కాలేయ వ్యాధి మధ్య సంబంధం

ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియా సార్బిటాల్‌ను విచ్ఛిన్నం చేస్తుందని పరిశోధనలో తేలింది, కానీ ఈ బ్యాక్టీరియా క్షీణించినప్పుడు లేదా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, సార్బిటాల్ శరీరంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఈ సార్బిటాల్ నేరుగా కాలేయంలోపలికి వెళ్లి కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది, ఇది ఆల్కహాల్ లేని ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. గతంలో, ఈ వ్యాధి సాధారణంగా ఆల్కహాల్‌ తాగే వారిలో మాత్రమే కనిపించేంది. కానీ ఇప్పుడు ఇది ఆల్కహాల్ లేని ఫ్యాటీ లివర్ వ్యాధిగా సర్వసాధారణంగా మారింది.

డైట్ సోడా, షుగర్ ప్రీ పదార్థాలు ప్రమాదకరమైనవి?

డైట్ సోడా, ఇతర షుగర్ ఫ్రీ పానీయాలు తీసుకోవడం వల్ల కూడా కాలేయ సమస్యలు వస్తాయి. ఎందుకంటే వాటిలో ఉపయోగించే కృత్రిమ తీపి పదార్థాలైన సార్బిటాల్ గట్ బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది కాలేయ కొవ్వును పెంచడమే కాకుండా జీవక్రియ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. షుగర్ ప్రీ పానియాలు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనవి కావు అలాగే అవి కాలేయ వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతాయని నిపుణులు అంటున్నారు.

ఐస్ క్రీం, డైట్ సోడా లేదా చూయింగ్ గమ్ వంటి వాటిలో ఉపయోగించే సోర్బిటాల్, ఇతర కృత్రిమ తీపి పదార్థాలు కాలేయ ఆరోగ్యానికి హానికరం, కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలని ఆరోగ్య నిపుణులు చూసిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!