AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెత్తబుట్టలో వేసే దానిమ్మ తొక్కల వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

దానిమ్మ పండు వలుచుకుని గింజలు తిన్నాక ఆ తొక్కలను ఏం చేస్తారు? ఇంకేం చేస్తాం, డస్ట్‌బిన్‌లో పారేస్తాం అంటారా? అయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఎందుకంటే, మనం చెత్తబుట్టలో పారేసే ఆ చేదు తొక్కలే మన శరీరానికి ఒక సంజీవనిలా పనిచేస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ తొక్కలను ఎలా వాడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చెత్తబుట్టలో వేసే దానిమ్మ తొక్కల వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Pomegranate Peel Benefits
Krishna S
|

Updated on: May 20, 2026 | 6:40 AM

Share

దానిమ్మ పండు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. ముత్యాల్లాంటి గింజలను తింటూ.. ఆ తర్వాత దాని తొక్కను డస్ట్‌బిన్‌లో పారేయడం మనకు అలవాటు. కానీ మన తాతముత్తాతల కాలంలో దానిమ్మ తొక్కలను అమూల్యమైన ఔషధంగా భావించేవారని మీకు తెలుసా? అసలు నిజం ఏంటంటే.. దానిమ్మ గింజల కంటే, మనం పారేసే ఆ తొక్కల్లోనే అత్యధికంగా యాంటీఆక్సిడెంట్లు దాగున్నాయి. అవును, సైన్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఇకపై దానిమ్మ తిన్న తర్వాత తొక్కలను పొరపాటున కూడా పారేయకండి. అసలు ఆ చేదుగా ఉండే తొక్కలను ఎలా దాచుకోవాలి? వాటిని మన ఆహారంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

దానిమ్మ తొక్కను అమృతంలా మార్చుకోండిలా

  • దానిమ్మ తొక్కలను నేరుగా తింటే చేదుగా ఉంటాయి. అందుకే వాటిని పొడి రూపంలో మార్చుకోవాలి.
  • దానిమ్మ పండు లోపల ఉండే పల్చటి పసుపు రంగు గుజ్జును పూర్తిగా తీసివేయాలి.
  • ఆ తర్వాత తొక్కను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
  • ఈ ముక్కలను ఒక కాటన్ గుడ్డపై లేదా పళ్ళెంలో వేసి ఎండలో బాగా ఆరబెట్టాలి.
  • తొక్కలు పూర్తిగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి.
  • ఈ పొడిని గాలి చొరబడనిసీసాలో భద్రపరుచుకుంటే, నెలల తరబడి అస్సలు పాడవదు.

డైలీ డైట్‌లో ఎలా వాడాలి?

సూపర్‌ఫుడ్ దానిమ్మ టీ: ఉదయం తాగే నార్మల్ టీకి బదులుగా ఈ హెల్తీ టీ ట్రై చేయండి. ఒక గ్లాసు నీటిని మరిగించి, అందులో ఒక టీస్పూన్ దానిమ్మ తొక్క పొడి వేయాలి. తక్కువ మంట మీద 5 నిమిషాలు మరిగించి, వడకట్టి తాగేయడమే. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతుంది.

స్మూతీలు – జ్యూస్‌లలో: మీరు రోజూ తాగే అల్పాహార స్మూతీలు, ఓట్ మిల్క్ లేదా నార్మల్ ఫ్రూట్ జ్యూస్‌లలో ఒక అర టీస్పూన్ ఈ పొడిని కలిపేయండి. దీనివల్ల ఆ చేదు ఏమాత్రం తెలియకుండానే బాడీకి పోషకాలు అందుతాయి.

హెల్తీ సలాడ్ టాపింగ్: వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్స్ తినేటప్పుడు, వాటిపై కొద్దిగా దానిమ్మ పొడి, కాస్త నిమ్మరసం చల్లుకుంటే సలాడ్‌కు అదిరిపోయే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది.

ప్రయోజనాలు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

రోగనిరోధక శక్తికి బూస్టర్: ఇందులో ఉండే విటమిన్ సి మరియు పాలిఫెనాల్స్ శరీర ఇమ్యూనిటీని కొండంత పెంచుతాయి. కాలానుగుణంగా వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్ల దరిచేరవు.

యవ్వనానికి కేరాఫ్ అడ్రస్ : యాంటీఆక్సిడెంట్లు భారీగా ఉండటం వల్ల ఇది చర్మ కణాల నష్టాన్ని పూడుస్తుంది. ముఖంపై ముడతలను తగ్గించి, అకాల వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుంది. చర్మానికి సహజమైన గ్లో ఇస్తుంది.

కడుపు సమస్యలకు పర్ఫెక్ట్ మెడిసిన్: ఈ పొడి మరిగించిన నీటిని తాగడం వల్ల మోషన్స్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఇన్స్టంట్ ఉపశమనం లభిస్తుంది. ఇది ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియాను రక్షిస్తుంది.

గొంతు నొప్పి, నోటి దుర్వాసనకు చెక్: గోరువెచ్చని నీటిలో ఈ పొడిని కలిపి పుక్కిలిస్తే తు నొప్పి, కఫం త్వరగా తగ్గుతాయి. నోటి దుర్వాసన పోయి దంతాలు దృఢంగా మారతాయి.

ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతీ వస్తువులోనూ ఒక అద్భుతమైన గుణం దాగి ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే ఈ దానిమ్మ తొక్కల ఔషధాన్ని వాడుకుని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి.

Follow Us