AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loans: బంగారం రుణాలలో సౌత్‌ ఇండియా టాప్‌.. జాబితాలో తెలుగు రాష్ట్రాలు..!

Gold Loans: ఇక రూ.14.5 లక్షల కోట్లలో టాప్ 10 రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేవలం రూ.1.3 లక్షల కోట్లు మాత్రమే బంగారం రుణాలు తీసుకున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలంలో 3.63 కోట్ల ..

Gold Loans: బంగారం రుణాలలో సౌత్‌ ఇండియా టాప్‌.. జాబితాలో తెలుగు రాష్ట్రాలు..!
Subhash Goud
|

Updated on: Dec 06, 2025 | 4:18 PM

Share

Gold Loans: బంగారు రుణాలు. ఇవి అత్యవస సమయాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పెద్దగా డాక్యుమెంటేషన్‌ లేకుండా, కొన్ని నిమిషాల్లోనే బంగారంపై రుణం తీసుకోవచ్చు. అందుకే చాలా మంది ఈ రుణాలపై ఆసక్తి చూపుతుంటారు. దీనికి సిబిల్‌ స్కోర్‌ అవసరం లేదు.. ఇతరుల ష్యూరిటీ అవసరం లేదు. ఇతర బ్యాంకు రుణాలకు అయితే చాలా ప్రాసెస్‌ ఉంటుంది. చివరకు అది మంజూరు అవుతుందా? లేదా అనేది తెలియదు. అదే బంగారంపై రుణాలకు చాలా తక్కువ ప్రాసెస్‌లో తక్కువ సమయంలోనే రుణం పొందవచ్చు. చాలా కుటుంబాల్లో రుణం అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బంగారంపై రుణం.

మిగతా రుణాలతో పోల్చుకుంటే గోల్డ్ లోన్ రావడం చాలా సులభంగా ఉంటుంది. దీనికి ఎక్కువగా పత్రాలు అవసరం ఉండవు. ఈ రుణాల్లో తెలంగాణ, ఏపీ వాటా కూడా ఎక్కువే ఉందని నివేదికలు చెబుతున్నాయి. అంటే ఈ రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా బంగారంపైనే రుణాలు తీసుకుంటున్నారట.

అగ్రస్థానంలో తమిళనాడు:

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 2025 నాటికి భారతదేశంలో మొత్తం బంగారు రుణాలు రూ.14.5 లక్షల కోట్లకు చేరుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాలు మార్కెట్‌లో 76.55 శాతం వాటా కలిగి ఉన్నాయి. రూ.4.9 లక్షల కోట్లతో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జాతీయ బంగారు రుణ మార్కెట్‌లో దక్షిణాది రాష్ట్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Alcohol: ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో ఉందో తెలిస్తే షాకవుతారు!

రూ.14.5 లక్షల కోట్లలో టాప్ 10 రాష్ట్రాలు!

ఇక రూ.14.5 లక్షల కోట్లలో టాప్ 10 రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేవలం రూ.1.3 లక్షల కోట్లు మాత్రమే బంగారం రుణాలు తీసుకున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలంలో 3.63 కోట్ల మంది వినియోగదారులు రూ.6 లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలను పొందారు. ఇది గత సంవత్సరం కంటే రుణ విలువలో 53 శాతం వృద్ధిని, కస్టమర్ బేస్‌లో 16 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

తమిళనాడు: 4.9 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్: 3.4, కర్ణాటక: 1.4 లక్షల కోట్ల రుణాలతో టాప్ 3లో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో తెలంగాణ, కేరళ ఉన్నాయి. కనీస డాక్యుమెంటేషన్, సౌకర్యవంతమైన షరతులను అందిస్తున్నందున ఈ బంగారం రుణాలపై చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

ఇది కూడా చదవండి: Tech Tips: మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి.. కొన్ని సెకన్లలోనే బ్లాక్‌ అవుతుంది.. ఎవ్వరు ఉపయోగించలేరు!

ఇది కూడా చదవండి: IndiGo: ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!