AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral Video: భార్యను ఆటపట్టించిన భర్త.. మూల్యం చెల్లించుకున్న కొడుకు.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral Video: సోషల్ మీడియాలో ప్రతి రోజూ వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు

viral Video: భార్యను ఆటపట్టించిన భర్త.. మూల్యం చెల్లించుకున్న కొడుకు.. ఫన్నీ వీడియో మీకోసం..
Viral Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 16, 2021 | 6:40 AM

Viral Video: సోషల్ మీడియాలో ప్రతి రోజూ వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు మనసును కలచివేసే విధంగా ఉంటాయి. అయితే, కొన్ని వీడియోలు చూస్తే మాత్రం అయ్యో పాపం అనిపిస్తుంటుంది. అదే సమయంలో కడుపుబ్బా నవ్వు పుట్టిస్తుంది. సాధారణంగా ప్రతి వ్యక్తి తాను చేసిన తప్పుకు తానే శిక్ష అనుభవిస్తాడు. అయితే కొన్నిసార్లు కొంతమందికి అన్యాయం జరుగుతుంది. తప్పు చేసి తప్పించుకుని.. ఇతరులను బలి చేస్తుంటారు. కంత్రీలు చేసే పనులు తెలియక ఆ అమాయకులు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఏం జరిగిందా? అని ఆలోచించి అవగతం చేసుకునే లోపు.. జరగాల్సిన నష్టం జరుగిపోతుంది. తాజాగా ఇలాంటి ఘటనకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను మీరు చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఈ వీడియోలో.. ఓ వ్యక్తి తన భార్యను ఆటపట్టిస్తూనే కొడుకును అడ్డంగా బుక్ చేస్తాడు.

చిన్నతనంలో చాలా మంది తమ సోదరి, సోదరీమణులు చెప్పే చాడీలకు బలైన సందర్భాలు అనేకం ఉంటాయి. తల్లిదండ్రులు.. ఒకరు చేసిన తప్పుకు మరొకరిని శిక్షించే సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. కానీ, ఓ తండ్రి తాను తప్పు చేసి కొడుకు బలి చేయడం ఎప్పుడైనా చూశారా? ఒక తండ్రి తన కొడుకును అలా బుక్ చేస్తాడా? కానీ, ఇక్కడ చేశాడు. అయితే, ఇది చాలా సరదా సన్నివేశం. ఓ వ్యక్తి తన భార్యను ఆటపట్టిస్తూనే.. కొడుకు అడ్డంగా బుక్ చేశాడు. ఆపై ఏమీ ఎరుగనట్లు అక్కడి నుంచి జారుకున్నాడు. దాంతో ఆ యువకుడు తన్నులు తినాల్సి వచ్చింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ వీడియోలో ఓ మహిళ వంటగదిని శుభ్రం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఫ్లోర్ క్లీన్ చేస్తుండగా.. అక్కడికి వచ్చిన ఆమె భర్త కెచప్‌ను స్లాబ్‌పై పడేస్తాడు. అనంతరం ఆ కెచప్ బాటిల్‌ను తన కొడుకు చేతికి ఇచ్చి పారిపోతాడు. ఫోన్ ఆపరేట్‌ చేస్తూ బిజీగా ఉన్న ఆ కొడుక్కి అసలు విషయం తెలియదు. అయితే, స్లాబ్‌పై కెచ్ పడి ఉండటాన్ని చూసి ఆ మహిళ షాక్ అవుతుంది. వెనక్కి తిరిగి చూడగా.. కొడుకు చేతిలో కెచప్ బాటిల్‌ కనిపించడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇక అంతే.. ఆ యువకుడిని పొట్టు పొట్టుగా కొడుతుంది. అతన్ని తన్ని బయటకు తరిమేస్తుంది. ఇలా తండ్రి చేసిన తప్పుకు.. కొడుకు బలయ్యాడన్నమాట.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో హెప్‌గుల్ 5 అనే అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. తండ్రి యొక్క పైశాచికత్వాన్ని, కొడుకు అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటున్నారు. నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేయడమే కాకుండా.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి మరి.

Viral Video:

View this post on Instagram

A post shared by hepgul5 (@hepgul5)

Also read:

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లింట తీవ్ర విషాదం..

Shocking Video: వీడి వయస్సు ఏడాది మాత్రమే.. ఆరు అడుగుల గేటు ఈజీగా ఎక్కేశాడు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Bhishma-Bhima: గంగా స్నానం.. గంగలో అస్థికలు కలపడానికి గల పరమార్ధాన్ని భీముడికి చెప్పిన భీష్ముడు