Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Murder: రమ్యను హత్య చేసిన శశికృష్ణను అరెస్ట్ చేశాం.. కఠినంగా శిక్షిస్తాం : డీజీపీ గౌతమ్ సవాంగ్

గుంటూరు బి. టెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయి శశికృష్ణని అరెస్ట్ చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రమ్య హత్య ఘటన అత్యంత దురదృష్టకరమన్న

Ramya Murder: రమ్యను హత్య చేసిన శశికృష్ణను అరెస్ట్ చేశాం.. కఠినంగా శిక్షిస్తాం : డీజీపీ గౌతమ్ సవాంగ్
Ramya Murder Cctv Footage
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 15, 2021 | 9:11 PM

SasiKrishna Arrest – AP DGP – Gowtham Sawang: గుంటూరు బి. టెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయి శశికృష్ణని అరెస్ట్ చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రమ్య హత్య ఘటన అత్యంత దురదృష్టకరమన్న డీజీపీ.. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించడం జరిగిందన్నారు. “ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందుతుణ్ణి కఠినంగా శిక్షిస్తాము. సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. యువతులు, మహిళల పై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవు.” అని ఈ సందర్భంగా డీజీపీ హెచ్చరించారు.

జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడవద్దని ఈ సందర్భంగా డీజీపీ మనవి చేశారు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలన్న సవాంగ్.. ఘటన జరిగిన తక్షణం వేగంగా స్పందించి కేసు ను ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులకు అభినందనలు చెప్పారు. ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి సత్వరం కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. మహిళల రక్షణ మా ప్రథమ కర్తవ్యం.. ఇందుకోసమై అహర్నిశలు శ్రమిస్తాం అని డీజీపీ చెప్పుకొచ్చారు. ఇన్ స్టా గ్రామ్ లో రమ్యకి పరిచయం అయిన శశికృష్ణ.. తర్వాత ప్రేమ పేరుతో ఆమెను వేధించి హత్య చేసేంత వరకూ వచ్చాడని డీజీపీ తెలిపారు. రమ్య హత్యకేసుకు సంబంధించి వివరాలను ఈ సాయంత్రం డీజీపీ కార్యాలయంలో సవాంగ్ వెల్లడించారు.

రమ్య హత్య ఘటనపై సీఎం జగన్ ఆరా.. కఠిన చర్యలకు ఆదేశం, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ప్రకటన

ఇలా ఉండగా, గుంటూరులో నడి రోడ్డుమీద పట్టపగలు యువతి రమ్యను హత్య చేసిన ఉదంతంపై సీఎం వైయస్‌ జగన్మోహన్ రెడ్డి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘దిశ’ కింద వేగంగా చర్యలను తీసుకుని దోషికి కఠినశిక్ష పడేలా చేయాలన్నారు. ఘటన వివరాలు తెలియగానే హోంమంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని.. పరిహారంగా రూ.10 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

కాగా, ఈరోజు ఉదయం గుంటూరు నగరం కాకాణి రోడ్డులో ఓ దుండగుడు బీటెక్ చదువుతోన్న విద్యార్థిని రమ్యను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. కాగా, దారుణ హత్యకు గురైన బిటెక్ విద్యార్థిని రమ్య ఉదంతంలో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. రమ్యను హత్య చేసింది శశి కృష్ణగా పోలీసులు నిర్ధారించారు. హత్య చేయడానికి ముందు నడిరోడ్డు మీద రమ్య చేయిపట్టుకుని నిందితుడు శశికృష్ణ మాట్లాడుతూ కత్తితో అతి కిరాతంగా పొడిచి చంపినట్టు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. నిందితుడి ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

స్వాతంత్ర్యం వచ్చిందని ఒక పక్క సంబరాలు చేసుకుంటుంటే, ఓ వైపు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే.. ఇంకోవైపు ఆడబిడ్డపై కత్తి దూశాడా ఉన్మాది. ఎందుకు.. ఏంటని.. ప్రశ్నించేలోపే నడిరోడ్డుపై కిరాతకంగా కడతేర్చాడు. ఈ అమానవీయ ఘటన తెలుగురాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేస్తోంది.

Read also: Chinna Jeeyar Swamy: 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. ధర్మాన్ని ధైర్యంగా చెప్పుకోలేని వాతావారణం ఉంది: చిన్నజీయర్ స్వామీజీ