Chinna Jeeyar Swamy: 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. ధర్మాన్ని ధైర్యంగా చెప్పుకోలేని వాతావారణం ఉంది: చిన్నజీయర్ స్వామి

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ధర్మాన్ని ధైర్యంగా చెప్పుకోలేని వాతావారణం ఉందన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. గోమాతను

Chinna Jeeyar Swamy: 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. ధర్మాన్ని ధైర్యంగా చెప్పుకోలేని వాతావారణం ఉంది: చిన్నజీయర్ స్వామి
China Jeeyar Swamy
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 15, 2021 | 8:32 PM

Tridandi Chinna Jeeyar Swamiji: 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ధర్మాన్ని ధైర్యంగా చెప్పుకోలేని వాతావారణం ఉందన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌ నుంచి తిరుమలకు పాదయాత్రను స్వామీజీ ఇవాళ హైదరాబాద్ ప్రారంభించారు. గోమాత వల్ల ఆర్థిక, ఆరోగ్య లాభాలు ఉన్నాయని గుర్తు చేశారు.

కాగా, గురుస్వామి బాలకృష్ణ ఆధ్వర్యంలోని బృందం హిమాయత్ నగర్‌ టీటీడీ దేవస్థానం నుంచి తిరుమల శ్రీవారి సన్నిధి వరకు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. వారి సత్ సంకల్పం నెరవేరాలంటూ మంగళశాసనాలు అందించారు చిన్నజీయర్ స్వామీజీ.

ఇలా ఉండగా, గోవధ నియంత్రణపై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన క్రమంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఏఐఎంఐఎం నేత సయ్యద్‌ అసీం వకార్‌ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. గోమాతను కాపాడేలా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఓ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ఆయన కోరారు. పాలివ్వని ఆవులను అమ్మేవారిని కూడా కఠినంగా శిక్షించి రూ 20 లక్షల జరిమానా విధించాలని అన్నారు.

విక్రేతల నుంచి మంచి ధరలకు గోవులను కొనుగోలు చేసి వాటిని షెల్టర్‌ హోంలలో ఉంచేలా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాలని వకార్‌ సూచించారు. ఆవులు వీధుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్‌ పదార్ధాలను తింటూ, డ్రైన్‌ల నుంచి నీటిని తాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read also: Sun Parivar scam: సన్ పరివార్‌ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ స్కాంలో మోసాలకే మోసాలు.. దొంగలకే దొంగలు

Harishrao: ఈటల అరాచకాలపై పోచమల్లు వచ్చాడు.. న్యాయం – ధర్మం రెండూ గెలిచాయి: మంత్రి హరీశ్ రావు

Political Temples: ఏపీలో కొత్త ట్రెండ్.. భారీ స్థూపాలతో పొలిటికల్ లీడర్లకు గుడి కట్టేస్తున్నారు