Allah gift: కర్నూలు జిల్లాలో గొయ్యి తవ్వుతుండగా బయల్పడ్డ గుర్రం, కత్తి, పీరు.. మోహరం ముందు అల్లా కృపేనంటోన్న ముస్లింలు
కర్నూలు జిల్లాలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో ఓ ఇంటి అవరణంలో గుర్రం, కత్తి, పీరు వస్తువులు బయటపడ్డాయి.
Kurnool: కర్నూలు జిల్లాలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో ఓ ఇంటి అవరణంలో గుర్రం, కత్తి, పీరు వస్తువులు బయటపడ్డాయి. మోహరం పండగ ముందు బయటపడం కచ్చితంగా అల్లా దయే అంటున్నారు ముస్లిం ప్రజలు. మొక్కలు నాటడానికి గుంతలు తవ్వుతుండగా ఈ వస్తువులు బయటపడ్డాయి. కాగా, బయట పడిని వస్తూవులను చూడటానికి జనం తండోపతండాలుగా చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు వస్తుండటం విశేషం.
మంగళగిరి నరసింహస్వామి వారి ‘పానకం’ రేటెంతో తెలుసా..? అక్షరాలా రూ. ఒక కోటి 35 లక్షలు.!
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి పానకం వేలం పాటలో రికార్డ్ రేటు పలికింది. నిన్న జరిపిన వేలం పాటలో ఒక కోటి 35 లక్షలకు ఒకామె స్వామి వారి పానకంను దక్కించుకున్నారు. స్వామి వారి పానకానికి ఈ దఫా మరింత ఎక్కువగా రికార్డు స్థాయిలో ఆదాయం రావడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, గత సంవత్సరం సీల్డ్ టెండర్ ద్వారా కోటి 26 లక్షలు పలికిన పానకం రేటు కాగా, ఈసారి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకు టెండర్ పాడి కాంట్రాక్ట్ దక్కించుకుంది పున్నమ్మ.