AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Parivar scam: సన్ పరివార్‌ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ స్కాంలో మోసాలకే మోసాలు.. దొంగలకే దొంగలు

కొద్ది రోజుల క్రితం జరిగిన భారీ కుంభకోణంలో ఎస్‌వోటీ పోలీసుల ఎంక్వైరీలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రూ. 150 కోట్ల స్కామ్‌లో నిందితుడిగా

Sun Parivar scam: సన్ పరివార్‌ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ స్కాంలో మోసాలకే మోసాలు.. దొంగలకే దొంగలు
FD Interest Rates
Venkata Narayana
|

Updated on: Aug 15, 2021 | 7:31 PM

Share

Sun Parivar multilevel marketing scam: కొద్ది రోజుల క్రితం జరిగిన భారీ కుంభకోణంలో ఎస్‌వోటీ పోలీసుల ఎంక్వైరీలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రూ. 150 కోట్ల స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వ్యక్తి అరెస్టైనప్పటికి ఆ డబ్బును ఓ ఫ్లాట్‌లో దాచినట్లుగా తెలుసుకున్న అధికారులు విచారణలో నమ్మలేని నిజాలు రాబట్టారు. ఈమొత్తం కుంభకోణంలో ప్రభుత్వ టీచర్‌ మెతుకు రవీందర్‌తో పాటు మరో ఐదుగురు పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. సన్‌ పరివార్‌ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కుంభకోణంలో కొత్త పేర్లు బయటకొచ్చాయి. అధిక వడ్డీ ఇస్తానంటూ సిద్ధిపేటకు చెందిన ప్రభుత్వ టీచర్ మెతుకు రవీందర్‌ జనాన్ని మోసం చేసి రూ.150 కోట్లు కాజేశాడు. ఈవ్యవహారం బయటపడటంతో అతడ్ని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇది ఫ్లాష్ బ్యాక్ అయినప్పటికి అతను కాజేసిన డబ్బు ఏమైందన్న విషయంపై ఎస్‌వోటీ పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది.

ఈకేసులోనే ఆర్సీపురంలోని రవీందర్‌కి చెందిన ఫ్లాట్‌లో రూ. 14 కోట్లు దాచిపెట్టినట్లుగా పోలీసులు రాబట్టారు. జైలుకెళ్లిన రవీందర్‌ బాధితులకు తాను జైలు నుంచి రిలీజైన తర్వాత డబ్బు చెల్లిస్తానని చెప్పినట్లుగా తెలుసుకున్న నరేష్‌, అభిజిత్‌ అనే ఇద్దరు రవీందర్‌ ఫ్లాట్‌లో చోరీ చేసి రూ.14 కోట్ల రూపాయలు మాయం చేసారు. ఈ మొత్తం రూ.150 కోట్ల కుంభకోణంలో కొంత నగదు చోరీ జరిగినట్లు…ఆ డబ్బును ఎత్తుకెళ్లిన వాళ్లు వాటిని వేర్వేరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు పోలీసులు. ఈకేసులో ప్రధానంగా బయటకు వచ్చిన పేర్లు …పటేల్‌గూడ ఎంపీపీ ఈర్ల దేవానంద్, పటేల్‌గూడ సర్పంచ్ నితిషా శ్రీకాంత్‌గౌడ్. వీరితో పాటు నరేష్‌, అభిజిత్ అనే మరో ఇద్దరు పాత్రదారులుగా ఉన్నారు.

కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న రవీందర్‌ అరెస్ట్ తర్వాత ఆర్సీపురంలోని అతని ఫ్లాట్‌లో దాచిన డబ్బులో రూ.14 కోట్ల కొట్టేసారు నరేష్‌ అండ్ కో. ఆ డబ్బుతోనే పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేశారు. శివార్లలోని పటేల్‌గూడ గ్రామసర్పంచ్‌గా తన కూతురైన నితిషా శ్రీకాంత్‌గౌడ్‌ని పోటీ చేయించారు. ప్రజాప్రతినిధులకు కొంత డబ్బును విరాళాల రూపంలో ముట్టజెప్పినట్లుగా తెలుస్తోంది. 2018లో జరిగిన ఈ కుంభకోణం కేసులో రెండున్న ఏళ్ల తర్వాత మొత్తం డబ్బులో 14కోట్లు చోరీ అయినట్లు తెలుసుకున్న ఎస్‌వోటీ పోలీసులు నరేష్‌ అతని కుటుంబ సభ్యుల్ని మూడ్రోజుల క్రితమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఈకేసేలు ఎవరెవరి పాత్ర ఉంది..మిగిలిన డబ్బు ఏమైందని ఆరా తీస్తున్నారు.

Read also: Political Temples: ఏపీలో కొత్త ట్రెండ్.. భారీ స్థూపాలతో పొలిటికల్ లీడర్లకు గుడి కట్టేస్తున్నారు