Telangana Corona: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు..పూర్తిగా తగ్గిన మరణాలు
Telangana Corona: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ఎందరినో బలి తీసుకుంటోంది. కరోనా కట్టడికి రాష్ట్రాలు అనేక చర్యలు చేపట్టాయి. లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియతో ప్రస్తుతం కరోనా..
Telangana Corona: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ఎందరినో బలి తీసుకుంటోంది. కరోనా కట్టడికి రాష్ట్రాలు అనేక చర్యలు చేపట్టాయి. లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియతో ప్రస్తుతం కరోనా కట్టడిలో ఉంది. ఇక తెలంగాణలో తాజాగా గడిచిన 24 గంటల్లో 50,126 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 245 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,380కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణాల సంఖ్య 3,842కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 582 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 6,41,270కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,268 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగా, కోలుకున్నవారి రేటు 98.29 శాతం ఉంది.
కొత్తగా జిల్లాల వారిగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య
ఆదిలాబాద్-2, భద్రాది కొత్తగూడెం-4, జీహెచ్‌ఎంసీ -52, జగిత్యాల-7, జనగామ-3, జయశంకర్ భూపాలపల్లి-4, జోగులాంబ గద్వాల-2, కామారెడ్డి – ఎలాంటి కేసులు నమోదు కాలేదు, కరీంనగర్ -30, ఖమ్మం -7, కొమురంభీం ఆసిఫాబాద్-1, మహబూబ్‌నగర్-5, మహబూబాబాద్-4, మంచిర్యాల-9, మెదక్-1, మడ్చల్ -మల్కాజిగిరి-10, ములుగు-4, నాగర్ కర్నూలు – ఎలాంటి కేసులు లేవు, నల్లగొండ- 17, నారాయణపేట-1, నిర్మల్ -1, నిజామాబాద్ -5, పెద్దపల్లి -10, రాజన్న సిరిసిల్ల-4, రంగారడ్డి -16, సంగారెడ్డి -1, సిద్దిపేట-5, సూర్యాపేట -8, వికారాబాద్- 2, వనపర్తి-1, వరంగల్ రూరల్ -14, వరంగల్ అర్బన్ -15, యాదాద్రి భువనగిరి – ఎలాంటి కేసులు లేవు. ఈ విధంగా గడిచిన 24 గంటల్లో వివిధ జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య.
కాగా, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు ఊరిపి పీల్చుకుంటున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. అయితే థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు సూచిస్తుండటంతో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. పాజిటివ్ కేసులు తగ్గినా.. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ కూడా చదవండి: Health Insurance: మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందే!