MS Dhoni Fan: ‘తలైవా’ ధోనిని కలిసేందుకు 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన ఫ్యాన్.. ఫైనల్‌గా..?

భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీపై తనదైన శైలిలో అభిమానాన్ని పంచుకున్నాడో అభిమాని. ఆయనను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు..

MS Dhoni Fan: 'తలైవా' ధోనిని కలిసేందుకు 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన ఫ్యాన్.. ఫైనల్‌గా..?
Ms Dhoni Fan
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 16, 2021 | 10:16 PM

భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీపై తనదైన శైలిలో అభిమానాన్ని పంచుకున్నాడో అభిమాని. ఆయనను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఇందుకోసం ఏకంగా 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాడు. హరియాణాలో తన గ్రామం నుంచి నడక ప్రారంభించిన 18 ఏళ్ల అజయ్‌ గిల్‌ 1400 కిలో మీటర్లు నడిచి ఝార్ఖండ్‌ రాంచీకి చేరుకున్నాడు. జులై 29న పయనమైన అజయ్‌ 17 రోజుల పాటు నడిచి ధోనీ స్వస్థలం వచ్చేశాడు. ఇంత సాహసం చేసినా.. ఆ యువకుడికి నిరాశే ఎదురైంది. గిల్‌ రాంచీకి చేరుకునే రెండు రోజుల ముందే ఐపీఎల్‌ కోసం ధోనీ దుబాయ్‌కి పయనమయ్యాడు. అయినా తన ఫేవరేట్‌ తిరిగొచ్చేవరకు ఇక్కడే ఎదురుచూస్తానని ఈ యువకుడు చెప్తున్నాడు. మహీని కలిసిన తర్వాతే తిరిగి వెళతానని చెప్పాడు. ఇంతదూరం కాలినడకన వచ్చినందుకు ధోనీ తనతో 10 నిమిషాలైనా మాట్లాడతాడు అని ఆశాభావం వ్యక్తం చేశాడు అజయ్‌.

తన స్వగ్రామంలో ఓ సెలూన్‌లో పనిచేసే అజయ్‌ చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. జుట్టుకు పసుపు, ఆరెంజ్‌, నీలం రంగులు వేసుకొని.. తలకు రెండు వైపులా ధోనీ, మహీ అనే పేర్లతో దర్శనమిస్తున్నాడు. ధోనీని కలిసేందుకు నడుచుకుంటూ వెళుతున్నాననే విషయం తెలుసుకున్న సోనేపత్‌లోని ఓ బార్బర్‌ తనను ఇలా తయారుచేసినట్లు అజయ్‌ తెలిపాడు. క్రికెటర్‌ కావాలని కలలు కన్నానని.. కానీ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత క్రికెట్‌ ఆడటం మానేశానని గిల్‌ తెలిపాడు. మహీ ఆశీర్వాదంతోనే మళ్లీ క్రికెట్‌ ఆడాలని భావిస్తున్నట్లు వివరించాడు. అజయ్‌ గురించి తెలుసుకున్న అనురాజ్‌ చావ్లా అనే వ్యక్తి.. యువకుడిని ఓ హోటల్‌ రూంకి తీసుకెళ్లారు. ధోనీ వచ్చేందుకు ఇంకా చాలారోజులు పట్టనుండటంతో ఇంటికి వెళ్లాలని అతడికి సూచించారు. కాలినడకన వచ్చినందుకు అతడికి దిల్లీ వరకు విమాన టికెట్‌ను అందించారు. మహీ వచ్చాక మళ్లీ రావాలని అజయ్‌కి సూచించినట్లు అనురాగ్‌ తెలిపారు.

Also Read: రమ్య మర్డర్ వెనుక మిస్టరీ వీడింది.. కీలక విషయాలు వెల్లడించిన గుంటూరు డీఐజీ రాజశేఖర్‌బాబు

పిడిగుద్దులు మాదిరి కత్తిపోట్లు.. ఉన్మాది అకౌంట్లను గతంలోనే బ్లాక్ చేసిన రమ్య.. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఘటన