Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 2nd Test Day 5 Live: ఇంగ్లాండ్ 120 పరుగులకు ఆలౌట్‌.. భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం..

uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2021 | 6:18 AM

India vs England 2nd Test Day 5 Live Score: టీమిండియా - ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టు ఉత్కంఠకరంగా మారే అవకాశం ఉంది. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుండటంతో రసవత్తరంగా సాగుతోంది. బ్యాడ్ లైట్ కారణంగా నాలుగవ రోజు ఆట ముగిసింది.

IND vs ENG 2nd Test Day 5 Live: ఇంగ్లాండ్ 120 పరుగులకు ఆలౌట్‌.. భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం..
Imishant

లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ని భారత బౌలర్లు ఒక్కసారిగా మార్చేశారు. ఇంగ్లాండ్‌ని కేవలం 120 పరుగులకే కట్టడి చేశారు. 151 పరుగుల తేడాతో భారత్‌కి ఘన విజయం అందించారు. దీంతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఐదో రోజు 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ని భారత్ కోలుకోలేని దెబ్బ తీశారు. భారత్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో అదరగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు, ఇషాంత్‌ శర్మ 2 వికెట్లతో రాణించారు.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 181/6 తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. జస్ప్రిత్‌ బుమ్రా 34 పరుగులు, మహ్మద్‌ షమి హాఫ్ సెంచరీ చేశారు. అనంతరం రిషభ్ పంత్‌ 22 పరుగులకే వెనుదిరిగాడు. కాసేపటికే జట్టు స్కోరు 209 వద్ద ఇషాంత్‌ శర్మ 16 పరుగులు వికెట్లముందు దొరికిపోయాడు. అనంతరం జోడీ కట్టిన షమి, బుమ్రా సింగిల్స్‌ తీస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఇద్దరు నాటౌట్‌గా నిలిచి 89 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దీంతో భారత్‌ చివరికి 298/8 వద్ద డిక్లేర్‌ చేసింది. ఆపై భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఓవర్‌ నుంచే వికెట్లు కోల్పోయింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 16 Aug 2021 11:10 PM (IST)

    ఇంగ్లాండ్ ఆలౌట్‌.. భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం..

    లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో 151 పరుగుల తేడాతో విజయ భేరి మోగించింది. ఇంగ్లాండ్ 120 పరుగులకు ఆలౌట్‌ అయింది. జేమ్స్ అండర్‌ సన్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. సిరాజ్ 4 వికెట్లతో అదరగొట్టాడు.

  • 16 Aug 2021 11:03 PM (IST)

    9 వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. జోస్ బట్లర్ 25 పరుగులు ఔట్

    ఇంగ్లాండ్‌ 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 25 పరుగులకు ఔటయ్యాడు. భారత్ విజయానికి ఒక వికెట్ దూరంలో ఉంది. సిరాజ్‌ బౌలింగ్‌లో పంత్‌ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. జేమ్స్ అండర్సన్ క్రీజులోకి వచ్చాడు.

  • 16 Aug 2021 11:00 PM (IST)

    8 వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్‌ 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. వోలీ రాబిన్ సన్ 9 పరుగులకు ఔటయ్యాడు. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్లూ్గా వెనుదిరిగాడు. దీంతో భారత్ విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉంది. మరోవైపు 25 పరుగులతో ఆడుతున్నాడు. క్రీజులోకి మార్క్ వుడ్ వచ్చాడు.

  • 16 Aug 2021 10:13 PM (IST)

    100 పరుగులు దాటిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్‌ 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు దాటింది. ఓటమి అంచున నిలిచింది. భారత్ విజయానికి ఇంకా 3 వికెట్ల దూరంలో ఉంది.

  • 16 Aug 2021 09:58 PM (IST)

    ఇంగ్లాండ్‌ ఏడు వికెట్లు 

    ఇంగ్లాండ్‌ ఏడు వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ వేసిన 39వ ఓవర్‌లో తొలి బంతికి మోయిన్‌ అలీ(13) స్లిప్‌లో కోహ్లీ చేతికి చిక్కగా తర్వాతి బంతికే సామ్‌కరన్‌(0) పంత్‌ చేతికి చిక్కాడు. దాంతో ఇంగ్లాండ్‌ 90 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి రాబిన్‌సన్‌ వచ్చాడు. మరోవైపు బట్లర్‌(8) పరుగులతో ఉన్నాడు. కాగా, భారత విజయానికి ఇంకా మూడు వికెట్ల దూరంలో నిలిచింది. ఇక 39 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 93/7తో నిలిచింది.

  • 16 Aug 2021 08:36 PM (IST)

    ఇంగ్లాండ్‌కు భారీ దెబ్బ..

    టీ విరామం తర్వాత ఇంగ్లాండ్‌కు మరో భారీ దెబ్బండి. బుమ్రా వేసిన బౌలింగ్‌లో తొలి ఓవర్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌(33) అవుటయ్యాడు. మూడో బంతికి రూట్‌ స్లిప్‌లో కోహ్లీ చేతికి దొరికిపోయాడు. దీంతో ఆ జట్టు 67 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీ బ్రేక్‌కు ముందు ఇషాంత్‌ వేసిన చివరి బంతికి బెయిర్‌స్టో(2) వికెట్లముందు దొరికిపోయిన సంగతి తెలిసిందే. భారత విజయానికి ఇంకా ఐదు వికెట్ల దూరంలో నిలిచింది. క్రీజులో బట్లర్‌, మోయిన్‌ అలీ ఉన్నారు.

  • 16 Aug 2021 08:17 PM (IST)

    ఇషాంత్‌ చేతిలో మరో వికెట్‌

    రెండో టెస్టు చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్‌ మరో వికెట్‌ కోల్పోయింది. ఇషాంత్‌ వేసిన 21వ ఓవర్‌ చివరి బంతికి బెయిర్‌స్టో (2) LBWగా వెనుదిరిగాడు. దాంతో టీ విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 22 ఓవర్లకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. మరోవైపు కెప్టెన్‌ జో రూట్‌ (33) పరుగులతో కొనసాగుతున్నాడు. చివరి సెషన్‌లో భారత్‌ ఆరు వికెట్లు తీస్తే విజయం సాధించే అవకాశం ఉంది.

  • 16 Aug 2021 07:39 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

    ఇంగ్లాండ్‌ మూడో వికెట్ కోల్పోయింది. ఇషాంత్‌ వేసిన 15.3 ఓవర్‌కు హమీద్‌ 9 తొమ్మిది వికెట్ల వద్ద తన వికెట్‌ను వదుల్కున్నాడు. దీంతో ఇంగ్లాండ్‌ 44 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది. మరోవైపు రూట్‌(21) పరుగులతో ఉండగా బెయిర్‌ స్టో క్రీజులోకి వచ్చాడు. ఇక 17 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్‌ 53/3గా నమోదైంది.

  • 16 Aug 2021 06:43 PM (IST)

    ఒక్క పరుగే ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు

    రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌‌కు మరో షాక్ తగిలింది. రెండు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లో బుమ్రా.. బర్న్స్‌ను అవుట్ చేయగా రెండో ఓవర్‌లో షమి.. సిబ్లీ(0)ని పెవిలియన్‌ దారి చూపించాడు.దీంతో ఇంగ్లాండ్‌ ఒక్క పరుగే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో హమీద్, జో రూట్‌ ఉన్నారు. 2 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 3/2గా నమోదైంది.

  • 16 Aug 2021 06:37 PM (IST)

    తొలి ఓవర్‌లోనే వికెట్‌..

    ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్‌ చేజార్చుకుంది. బుమ్రా వేసిన 0.3 ఓవర్‌కు రోరీబర్న్స్‌ సిరాజ్‌ చేతికి దొరికిపోయాడు. దాంతో ఆతిథ్య జట్టు ఒక్క పరుగుకే ఒక వికెట్‌ కోల్పోయింది. క్రీజులో సిబ్లీ, హమీద్‌ కొనసాగుతున్నారు.

  • 16 Aug 2021 06:23 PM (IST)

    అద్భుతమై స్వాగతం..

    అద్భుత ఆటతీరుతో దూసుకుపోతున్న టైలెండర్లకు భోజన విరామ సమయానికి టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఘన స్వాగతం పలికారు. చప్పట్లతో అభినందించారు. ఏళ్ల తరబడి ఈ ఇన్నింగ్స్‌ గుర్తుండిపోతుందని పేర్కొంటూ బీసీసీఐ ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. బుమ్రా(30), షమి(52) ఎనిమిదో వికెట్‌కు 77 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించడంతో జట్టు సభ్యులు సంతోషంలో మునిగారు.

  • 16 Aug 2021 06:23 PM (IST)

    టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌

    టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఐదోరోజు భోజన విరామం అనంతరం తిరిగి ఆట ప్రారంభమవ్వగా బుమ్రా(34*), షమి(56*) చెరో నాలుగు పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే 109.3 ఓవర్ల తర్వాత ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది టీమిండియా. అప్పటికి స్కోర్‌ 298/8గా నమోదైంది. దాంతో ఇంగ్లాండ్‌ టార్గెట్ ఇప్పుడు 272 పరుగులుగా నమోదైంది.

  • 16 Aug 2021 06:10 PM (IST)

    ఐదో రోజు లంచ్ బ్రేక్ సమయానికి…

    ఐదో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 286/8 స్కోర్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. బుమ్రా(30), షమి(52) ఎనిమిదో వికెట్‌కు 77 పరుగుల కీలక పార్టనర్ షిప్ నెలకొల్పి నాటౌట్‌గా కొనసాగుతున్నారు.

  • 16 Aug 2021 05:38 PM (IST)

    షమీ హాఫ్ సెంచరీ..

    మొయిన్ అలీ వేసిన ఓవర్‌లో మహ్మద్ షమీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవర్ మూడో బంతికి షమీ రెండో బంతికి మిడ్ వికెట్ వద్ద ఫోర్ కొట్టాడు. అదే సమయంలో బంతికి 92 మీటర్లకు సిక్స్ కొట్టి తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో షమీకి ఇది రెండో అర్ధ సెంచరీ. అతను 57 బంతుల్లో ఒక సిక్స్ , ఐదు ఫోర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు.

  • 16 Aug 2021 05:28 PM (IST)

    సరికొత్త రికార్డు..

    విదేశాలలో తొమ్మిదో వికెట్‌కు టీమిండియా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా  అత్యధిక స్కోరు నమోదు చేసిన జోడీగా రికార్డు నమోదైంది.

  • 16 Aug 2021 05:18 PM (IST)

    50 పరుగుల పార్టనర్ షిప్‌

    ఏం చేస్తారు లే.. అనుకున్న టీమిండియా టెయిలెండర్లు దూకుడుమీదున్నారు. షమి(34), బుమ్రా (23) నిలకడగా ఆడుతూ ఎనిమిదో వికెట్‌కు కీలకమైన 50 పరుగుల పార్టనర్ షిప్‌ను క్రియేట్ చేశారు. దాంతో కష్టాల్లో ఉన్న టీమిండియాకు గట్టెక్కించారు. ఈ క్రమంలోనే 102 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 259/8గా నమోదైంది.

  • 16 Aug 2021 05:09 PM (IST)

    200 లీడ్‌లో టీమిండియా..

    రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యం 200 పరుగులు దాటింది. మార్క్‌వుడ్‌ వేసిన 95వ ఓవర్‌లో బుమ్రా(14), షమి(13) నాలుగు సింగిల్స్‌ తీయడంతో ఓట్టు స్కోర్‌ 229/8కి చేరింది. దాంతో భారత్‌ ఆధిక్యం 202 పరుగులకు చేరింది.

  • 16 Aug 2021 04:25 PM (IST)

    బుమ్రా హెల్మెట్‌కు బలంగా తగిలిన బంతి

    మార్క్‌వుడ్ వేసిన 92.4 బంతి బుమ్రా హెల్మెట్‌కు బలంగా తాకింది. దాంతో వెంటనే వైద్య సిబ్బంది వచ్చి పరీక్షిస్తున్నారు. మరోవైపు ఈ ఓవర్‌లో బుమ్రా(9) తొలి బంతిని ఫోర్ కొట్టాడు. దీంతో టీమిండియా స్కోర్‌ 220/8గా చేరింది. ఇక షమి(9) పరుగులతో కొనసాగుతున్నాడు.

  • 16 Aug 2021 04:11 PM (IST)

    మరో వికెట్…

    రాబిన్‌సన్‌ వేసిన 89.3 ఓవర్‌కు ఇషాంత్‌ శర్మ(8) అవుటయ్యాడు. LBWగా వెనుదిరిగాడు. అతడు రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దాంతో భారత్‌ 209 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా(2), షమి(7) పరుగులతో కొనసాగుతున్నారు. 90 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 211/8గా నమోదైంది.

  • 16 Aug 2021 03:47 PM (IST)

    రిషబ్ పంత్‌ అవుట్..

    ఒల్లీ రాబిన్సన్ బౌలింగ్‌లో టీమిండియాకు భారీ దెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను పెవిలియన్‌కు పంపాడు. రాబిన్సన్ ఓవర్ మూడో బంతిని పంత్ రక్షించడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌ను తాకి జోస్ బట్లర్ చేతుల్లోకి వెళ్లింది. పంత్ 46 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇక్కడ నుండి భారతదేశానికి ముందున్న మార్గం ఇప్పుడు కష్టంగా ఉంది.

  • 16 Aug 2021 03:30 PM (IST)

    ప్రారంభమైన ఆట..

    టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఐదవ రోజు ఆట ప్రారంభమైంది. జేమ్స్ ఆండర్సన్ భారత రెండో ఇన్నింగ్స్‌లో 82 వ ఓవర్‌ను తీసుకువచ్చాడు. అతను ఈ ఓవర్‌లో ఒక పరుగు ఇచ్చాడు.

Published On - Aug 16,2021 2:49 PM

Follow us