తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ధోని శిష్యులు.. ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర.. వారెవరంటే?

తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ధోని శిష్యులు.. ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర.. వారెవరంటే?
Chepauk Super Gillies

TNPL 2021: చెపాక్ సూపర్ గిల్లీస్ టీం తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2021 టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో ఆ జట్టు రూబీ తిరుచ్చి వారియర్స్‌ని ఎనిమిది పరుగుల తేడాతో ఓడించింది...

Venkata Chari

|

Aug 16, 2021 | 1:59 PM

TNPL 2021: చెపాక్ సూపర్ గిల్లీస్ టీం తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2021 టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో ఆ జట్టు రూబీ తిరుచ్చి వారియర్స్‌ని ఎనిమిది పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ టీంలో నారాయణ జగదీషన్ 90 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ కారణంగా ఆరు వికెట్లకు 183 పరుగులు చేసింది. బౌలర్ల అద్భుతంగా బౌల్ చేయడంతో వారియర్స్ టీం ఏడు వికెట్లకు 175 వద్ద ఆగిపోయి విజయానికి దూరమైంది. చివరి ఓవర్‌లో రూబీ తిరుచ్చి వారియర్స్‌ విజయానికి 13 పరుగులు కావాలి. కానీ, చెపాక్‌కు చెందిన ఆర్. సాయి కిషోర్ నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. వారియర్స్ పి. సర్వన్ కుమార్ 25 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 45 పరుగులు సాధించాడు. కానీ, చివరి ఓవర్‌లో సాయి కిషోర్ బంతులను అతను ఆడలేకపోయాడు. చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ను మూడోసారి గెలుచుకుంది. విజేత జట్టు చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నారు. నారాయణ్ జగదీషన్, ఆర్. సాయి కిషోర్‌‌లు ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ఆడుతున్నారు. ఫైనల్‌లో ఇద్దరూ అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. IPL 2021కి ముందు సీఎస్‌కే కు ఇది మంచి పరిణామం.

మొదట బ్యాటింగ్ చేసిన చెపాక్‌ కెప్టెన్ కౌశిక్ గాంధీ (26), నారాయణ్ జగదీషన్ బలమైన ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లేలో ఇద్దరూ 58 పరుగులు జోడించారు. కానీ, ఆరో ఓవర్ చివరి బంతికి గాంధీ ఔట్ అయ్యాడు. అతను 19 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేశాడు. దీని తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. జగదీషన్ చివర్లో అద్భుతంగా ఆడాడు. అతను 58 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 90 పరుగులు సాధించాడు. 18వ ఓవర్లో జగదీషన్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. వారితో పాటు చివరి ఓవర్‌లో ఏడు బంతుల్లో ఎస్. హరీష్ కుమార్ 13, సోను యాదవ్ ఎనిమిది బంతుల్లో 17 పరుగులు సాధించారు. చెపాక్ జట్టు ఆరు వికెట్లకు 183 పరుగులు సాధించింది. రూబీ తిరుచ్చి వారియర్స్ తరపున రహిల్ షా, ఎమ్. పోయామోయి తలో రెండు వికెట్లు పడగొట్టారు.

20 పరుగులకే నాలుగు వికెట్లు.. లక్ష్యాన్ని సాధించే క్రమంలో వారియర్స్ టీం ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్ అమిత్ సాత్విక్ కేవలం 16 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సర్లతో 36 పరుగులు సాధించాడు. దీంతో జట్టు పవర్‌ప్లేలోనే 61 పరుగులు సాధించింది. కానీ, ఈ సమయంలో ఇద్దరు ఓపెనర్లు కూడా పెవిలియన్ చేరారు. సంతోష్ శివుడు 16, సాత్విక్ 36 పరుగులు సాధించారు. నిధిష్ రాజగోపాల్ కూడా పరుగుల వేగాన్ని తగ్గించకుండా 17 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు సాధించాడు. ఈ కారణంగా, జట్టు 10 ఓవర్లలో 90 పరుగులు సాధించింది. చివరకు 7 వికెట్లకు 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెపాక్ సులభంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పి. శర్వాన్ కుమార్ మ్యాచ్‌ను మళ్లీ మలుపు తిప్పాడు. ఎనిమిదవ స్థానంలో నిలిచిన వచ్చిన ఆయన.. తుఫాను ఇన్నింగ్స్ ఆడి జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు. కానీ, చివరి ఓవర్‌లో అతను అవసరమైన పరుగులు చేయలేకపోయాడు.

Also Read:

IPL 2021: తాలిబన్ల నియంత్రణలో ఆఫ్ఘనిస్తాన్.. రషీద్ ఖాన్, నబీలపై ప్రభావం పడనుందా.. ఐపీఎల్‌లో వీరి భవితవ్యం?

8మంది టీమిండియా ఆటగాళ్ల అరంగేట్రం.. అంచనాలు శూన్యం.. కానీ, ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu