AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Property Benefits: భార్య పేరు మీద ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?.. ఆసక్తికర విషయాలు మీకోసమే..

Property Benefits: ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు చాలామంది మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే, మహిళల పేరుతో ఇల్లు కొనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Property Benefits: భార్య పేరు మీద ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?.. ఆసక్తికర విషయాలు మీకోసమే..
Property
Shiva Prajapati
|

Updated on: Aug 17, 2021 | 6:50 PM

Share

Property Benefits: ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు చాలామంది మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే, మహిళల పేరుతో ఇల్లు కొనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఆదాయ పన్నులో మహిళలకు ఎక్కువ పన్ను రాయితీలు ఇస్తుంటారు. ఫలితంగా వారికి అధిక ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయం తెలిసన చాలా మంది మహిళ పేరు మీద ఇల్లు కొనుగోలు చేసి ఆదాయపు పన్నులో భారీ ఉపశమనం పొందుతారు.

ఇంకా.. ఇల్లు కొనడానికి గృహ రుణం తీసుకుంటే మహిళా కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు గృహ రుణాలపై 0.5 శాతం తక్కువ వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే, ఒక ఇంటిని మహిళ పేరుగా కొనుగోలు చేసినట్లయితే.. స్టాంప్ డ్యూటీలో మినహాయింపులు ఇస్తారు.

ఇక మహిళలు గృహాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రాష్ట్ర స్థాయిలో విస్తృత రాయితీలను అందిస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకంలో భాగంగా.. లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ (LIG), ఎకనామిక్ వీకర్ సెక్షన్ కేటగిరీ (EWS) కింద మహిళల పేరిట కేంద్ర ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తోంది.

ఎస్‌బిఐ అదిరిపోయే ఆఫర్.. ఇదే సమయంలో గృహ రుణాలపై ఎస్‌బిఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గృహ రుణాలు తీసుకునే వారికి 5 శాతం వడ్డీ తగ్గించింది. అయితే, ఎస్‌బిఐ యోనో యాప్ ద్వారా హౌస్ లోన్ అప్లై చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. సాధారణ గృహ రుణాల వడ్డీ రేటు 6.70 శాతం ఉంది. ఇక రూ. 30 లక్షల వరకు 6.70 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తుండగా.. రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు ఉండే గృహ రుణాలపై వడ్డీ రేటును 6.95 శాతంగా ఉంది. రూ. 75 లక్షలు, ఆ పైన గృహ రుణాలపై వడ్డీ రేటు 7.05 శాతంగా ఉంది.

Also read:

Raghunandan Rao: దళిత సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఎందుకివ్వరు? రఘునందన్ రావు ప్రశ్న

Hema Malini: ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆఫ్గనిస్థాన్‌లో అసలేం జరుగుతోంది.? ఆవేదన వ్యక్తం చేసిన హేమామాలిని.

Health Tips: షుగర్ పేషెంట్లు ఏ పండ్లు తినొచ్చు.. ఏ పండ్లు తినొద్దు.. పూర్తి వివరాలు మీకోసం..