Raghunandan Rao: దళిత సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఎందుకివ్వరు? రఘునందన్ రావు ప్రశ్న
'దుబ్బాక నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేయాలి.. లేదంటే ఉద్యమం చేస్తాం' అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చరించారు. 'దళిత సామాజిక వర్గానికి కార్పొరేషన్‌లతో సరిపెడుతున్నారు..
Dubbaka – Dalita Bandhu – MLA Raghunandan Rao: ‘దుబ్బాక నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేయాలి.. లేదంటే ఉద్యమం చేస్తాం’ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చరించారు. ‘దళిత సామాజిక వర్గానికి కార్పొరేషన్‌లతో సరిపెడుతున్నారు.. మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరు?’ అని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసిఆర్ సతీమని శోభ దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పలేదా? అని ఆయన ఈ సందర్భంగా అడిగారు. మూడేండ్లలో దేశంలోనే యాదవులు అత్యంత ధనవంతులు అవుతారని 2017లో సీఎం కేసీఆర్ చెప్పారని.. అయ్యారా..? అని రఘునందన్ నిలదీశారు.
“దుబ్బాక వెనకబడిన ప్రాంతం. కేసిఆర్ చదివిన, పెరిగిన ప్రాంతం కావున దళిత బంధు ఇక్కడ కూడా అమలు చేయాలి.. హుజూరాబాద్‌లో ఈటెలను ఎదుర్కోలేక దళిత బంధు పథకం పెట్టారని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దుబ్బాక లో కూడా అమలు చేయాలి”. అని రఘునందన్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధు పై రఘునందన్ రావు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి పలు డిమాండ్లను కేసీఆర్ సర్కారు ముందు ఉంచారు.
దళిత బంధును తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో అమలు చేయాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. గతంలో ఇంటింటికీ సర్వే నిర్వహించిన ప్రభుత్వ అధికారులను.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికీ దళిత బంధు ఇస్తా అనడం హాస్యాస్పదంగా ఉందని రఘునందన్‌రావు అన్నారు. అప్పటి ప్రధాని చేసిన తప్పిదాల కారణంగానే భారత్‌కు ఇరుగు పొరుగు దేశాలతో తరుచూ గొడవలు వచ్చే పరిస్థితులు దాపురించాయని రఘునందన్ రావు ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు.
Read also: Bandi Sanjay: తెలంగాణకు తీరని ద్రోహం.. టీఆర్ఎస్ సర్కారుపై బండి సంజయ్ లేఖాస్త్రం