‘మీ పక్షాన నేను నిలబడ్డా, కొట్లాడుతున్నా.. మీ అక్కగా మీ పోరాటాన్ని భూజానేసుకొని ప్రతి మంగళవారం ముందుకొస్తున్నా అధైర్యపడకండి : షర్మిల

'మీ పక్షాన నేను నిలబడ్డా, కొట్లాడుతున్నా.. మీ అక్కగా మీ పోరాటాన్ని భూజానేసుకొని ప్రతి మంగళవారం ముందుకొస్తున్నా అధైర్యపడకండి : షర్మిల
Ys Sharmila

తెలంగాణలో నిరుద్యోగులు ఎవరూ దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండని వైయస్ఆర్‌టీపీ అధినాయకురాలు వైయస్ షర్మిల అభ్యర్థించారు. మీ పక్షాన నేను నిలబడ్డాను, కొట్లాడుతున్నాను..

Venkata Narayana

|

Aug 17, 2021 | 7:22 PM

YS Sharmila: తెలంగాణలో నిరుద్యోగులు ఎవరూ దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండని వైయస్ఆర్‌టీపీ అధినాయకురాలు వైయస్ షర్మిల అభ్యర్థించారు. మీ పక్షాన నేను నిలబడ్డాను, కొట్లాడుతున్నాను.. మీ అక్కగా మీకు అండగా మీ పోరాటాన్ని భూజానేసుకొని ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి నిరాహార దీక్ష చేస్తున్నాను అని ఆమె అన్నారు. అధైర్యపడకండి.. KCR ముక్కుపిండి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇప్పిస్తానని షర్మిల తెలంగాణ యువతకు అభయమిచ్చే ప్రయత్నం చేశారు.

ఇలా ఉండగా, వైయస్ షర్మిల ప్రతీ మంగ‌ళ‌వారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్ష ఇవాళ ఆరో వారం కూడా దీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం గూడూరు మండలంలోని గుండెంగి గ్రామంలో షర్మిల దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా షర్మిల ‘జోహార్ సునీల్ నాయక్’ అంటూ నినాదాలు చేశారు.

“KCR గారి కొలువుల ఆటకు తమ్ముడు నగేష్ బలి అయ్యాడు. ఉద్యోగాలపై స్పష్టత లేని హామీలతో రోజుకో విద్యార్థిని చంపుతున్నాడు. ఆగస్టు 15న ఉద్యోగ ఖాళీల భర్తీ పై క్లారిటీ ఇస్తారని ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. అసలు మీకు మనసంటూ ఉందా? ఇంకెంత మంది చనిపోతే నోటిఫికెషన్స్ ఇస్తారు” అని షర్మిల తెలంగాణ సర్కారుని నిలదీశారు.

“ప్రాణాలు పొసే గాంధీ హాస్పిటల్లోనే మానాలు తీసేస్తుంటే, చంటి పిల్లల తల్లులను జైల్లో పెట్టిస్తుంటే, లాక్ అప్‌లో చంపేస్తుంటే ఎక్కడో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పై స్పందిస్తారు కానీ.. పక్కన జరిగిన సంఘటన పై మాత్రం స్పందించరు చిన్న దొర. మహిళల ప్రాణాలకు KCR KTR దొరలు కల్పిస్తున్న రక్షణ కు జై.” అంటూ షర్మిల ట్విట్టర్ ముఖంగా ఎద్దేవా చేశారు.

“KCR గారి ఏలుబడిలో రక్షణ దొరకాల్సిన చోట, ఊపిరి నిలుపాల్సిన చోట, మహిళల ప్రాణాలకు రక్షణ లేనప్పుడు, మహిళలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు వొదిలేసినప్పడు, మన కోసం మనమే నిలబడాలి. మన ఆత్మగౌరవం కోసం మన హక్కుల కోసం, మన రక్షణ కోసం ఉద్యమం నిర్మిద్దాం. పోరాటాన్ని కొనసాగిద్దాం.” అని షర్మిల పిలుపునిచ్చారు.

Read also: Raghunandan Rao: దళిత సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఎందుకివ్వరు? రఘునందన్ రావు ప్రశ్న

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu