AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: తెలంగాణకు తీరని ద్రోహం.. టీఆర్ఎస్ సర్కారుపై బండి సంజయ్ లేఖాస్త్రం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత వైఖరితో కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా, గోదవరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు

Bandi Sanjay: తెలంగాణకు తీరని ద్రోహం.. టీఆర్ఎస్ సర్కారుపై బండి సంజయ్ లేఖాస్త్రం
Bandi Sanjay
Venkata Narayana
|

Updated on: Aug 17, 2021 | 6:06 PM

Share

Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత వైఖరితో కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా, గోదవరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశాలకు గైర్హాజరు కావడంతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు పేజీల లేఖ రాశారు బండి సంజయ్.

కాగా, ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 14వ సమావేశం జరగనుంది. ఈ ఫుల్ బోర్డ్ మీటింగ్ కు హాజరు కావాలని బోర్డ్ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్ పురే తెలంగాణ, ఏపీకి ఇప్పటికే లేఖ రాశారు. మీటింగ్ లో చర్చించే ఎజెండాను లేఖతో పంపారు. కృష్ణా బోర్డు సమావేశంలో చాలా అంశాలు చర్చకు రానున్నాయి. కృష్ణ బేసిన్ లో లభ్యమయ్యే నీటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, తెలంగాణ కోరినట్టు రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటాపై చర్చించడం, ఒక సంవత్సరంలో వాడుకోలేకపోయిన నీటిని తర్వాతి ఏడాదికి క్యారీ చేయడంపై చర్చించనున్నారు.

కాగా, ప్రస్తుతం బోర్డు ఖాతాలో 2 కోట్ల 46 లక్షలు మాత్రమే ఉన్నాయని, వీటితో నిర్వహణ కష్టమని తెలిపారు. రెండు రాష్ట్రాలు వెంటనే 10 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాలని సూచించారు. ఈ నెల 9న జరిగిన నిర్వహించిన మీటింగ్ కు తెలంగాణ అధికారులు, ఇంజినీర్లు హాజరు కాలేదు.

ఇలా ఉండగా, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు బీజేపీ ‘దరఖాస్తుల ఉద్యమాన్ని’ ప్రారంభించడం జరిగిందని బండి సంజయ్ తెలిపారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ హామీలను అమలయ్యేలా ఒత్తిడి తీసుకొచ్చి, తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ దరఖాస్తుల ఉద్యమాన్ని చేపడుతున్నామే తప్ప రాజకీయ లబ్ధి కోసం కాదని సంజయ్ వివరణ ఇచ్చారు.

Sanjay Letter 1

Bandi Sanjay Letter To Kcr

Read also: Ganja plants: సర్కార్ దవాఖానలో గంజాయి మొక్కల కలకలం.. తలలు పట్టుకుంటోన్న అధికారులు